Raasi : రంగమ్మత్త పాత్రను రాశి వదులుకోవడానికి కారణం ఏంటో తెలుసా.. అదే అనసూయకు కలిసొచ్చింది..!

August 14, 2022 8:40 AM

Raasi : ఒకప్పుడు తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి రాశి. తన నటనతో అభిమానుల గుండెలను కొల్లగొట్టింది. జగపతి బాబు నటించిన శుభాకాంక్షలు సినిమాతో రాశి తెలుగు తెరకు పరిచయమైంది. సౌందర్య తర్వాత తెలుగు ప్రేక్షకులకు తమ ఇంటి మనిషిగా అనిపించిన నటీమణి రాశి. తెలుగుతోపాటు ఇతర సౌత్ భాషలలోనూ రాశి అందాలు ఆరబోసింది. అగ్ర దర్శకులతో పనిచేసిన రాశి.. ఒకవైపు కుటుంబ కథా చిత్రాలను చేస్తూనే గ్లామర్ రోల్స్ లో కూడా అల్లాడించింది.

రవితేజ నటించిన వెంకీ సినిమాలో ఓ ఐట‌మ్‌ సాంగ్ చేసి మాస్ ఆడియన్స్‌ని ఒక కుదుపు కుదిపింది. నిజం లాంటి సినిమాలో గోపీచంద్ సరసన నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కూడా నటించి మెప్పించింది. ఇలా ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగల రాశి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ రంగస్థలం సినిమాలో అద్భుతమైన అవకాశం వస్తే మాత్రం నిర్మొహమాటంగా నో చెప్పింద‌ట‌. ఈ సినిమాలో అనసూయ‌ పోషించిన రంగమ్మత్త పాత్రకు సుక్కూ ముందు రాశిని అనుకున్నారట.

Raasi told why she rejected Rangasthalam movie offer
Raasi

కథ, పాత్ర చెప్పారు. అయితే, పాత్ర స్వభావం కోసం మోకాళ్లపైకి చీర కట్టుకోవాలి.. మందు తాగే సీన్స్ చేయాలి.. అని సన్నివేశాలను చెప్పగానే రాశి నో అన్నదట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. అలా మోకాళ్ల పైకి తొడ‌లు క‌న‌ప‌డేలా చీర కట్టుకోవాలంటే నాకెందుకో ఇబ్బందిగా అనిపించింది. పెద్ద సినిమా అయినా ఆ పాత్రలో నన్ను చూడాలంటే ఆడియన్స్ అంతగా ఇష్టపడరని వదులుకున్నాను.

కానీ ఆ పాత్ర చేసి ఉంటే బాగుండేదని తర్వాత అనిపించింది. అయినా అనసూయ ఆ రోల్ లో చాలా బాగా చేసింద‌ని మెచ్చుకుంది రాశి. నిజంగా ఆ రోల్ లో రాశి కనుక చేసి ఉంటే ఇప్పుడు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మరో లెవల్ లో ఉండేదని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment