DJ Tillu : డీజే టిల్లు – 2 లో రాధికా ప్లేస్‌లో ఎంట్రీ ఇస్తున్న మళ‌యాళం బ్యూటీ ఎవరో తెలుసా..?

August 13, 2022 8:04 PM

DJ Tillu : యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ సినిమా డీజే టిల్లు. అట్లుంటది మనతోని.. అనేది సినిమా ట్యాగ్ లైన్. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను విమల్ కృష్ణ డైరెక్ట్ చేశారు. ఈ ఏడాది బాక్సాఫీసు వద్ద పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు కూడా కలెక్షన్స్ లేక థియేటర్లు వెలవెలబోతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డీజే టిల్లు బ్లాక్‌ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలై కొన్ని నెలలు గడుస్తున్నా ఇప్పటికీ మూవీ లవర్స్ ఈ సినిమాను.. అందులోని మాటలను, పాటలను మర్చిపోలేకపోతున్నారు.

ఈ సినిమా తరువాత సిద్ధు జొన్నలగడ్డ పేరు డీజే టిల్లుగా మారిపోయింది. అయితే డీజే టిల్లు సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు అందరూ డీజే టిల్లు పార్ట్-2 కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా డీజే టిల్లు-2పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రాధికాగా నటించిన నేహా శెట్టి ప్లేస్‌ లో అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించపోయినా.. సోషల్ మీడియాలో ఈ న్యూస్ విపరీతంగా ప్రచారం జరుగుతోంది.

anupama parameswaran reportedly selected for DJ Tillu movie second part
DJ Tillu

ప్రస్తుతం అనుమప పరమేశ్వరన్ కెరీర్ మళ్లీ ఊపందుకుంది. ఈ ఏడాది మొదట్లో వచ్చిన రౌడీ బాయ్స్ సినిమాతో ఆడియన్స్‌ను అలరించింది ఈ మలయాళ బ్యూటీ. తాజాగా కార్తికేయ 2 మూవీలో నిఖిల్ సిద్దార్థ్ సరసన హీరోయిన్‌గా నటించింది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో అనుపమ కెరీర్ లో మరో హిట్ బొమ్మ ఈ అమ్మడి ఖాతాలో చేరినట్లైంది. అలాగే ప్రస్తుతం నిఖిల్‌తోనే కలిసి 18 పేజెస్ మూవీ చేస్తోంది అనుపమ. దీనికి సూర్య ప్రతాప్ డైరెక్టర్ కాగా బన్నీ వాస్ ప్రొడ్యూసర్. ఈ క్ర‌మంలోనే అనుప‌మ‌కు ఈ ఏడాది ల‌క్ క‌ల‌సి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment