Kiara Advani : త‌న ప్రియుడికి బ్రేక‌ప్ చెప్పేసిన కియారా అద్వానీ..? మ‌ళ్లీ చెట్టా ప‌ట్టాల్‌..?

August 12, 2022 10:25 PM

Kiara Advani : 2014లో ఫుగ్లీ చిత్రంతో బాలీవుడ్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. ఆ తర్వాత సుశాంత్ రాజ్ పూత్ హీరోగా నటించిన ఎంఎస్ ధోనీ అన్ టోల్డ్ స్టోరీ చిత్రంలో ధోనీ భార్యగా నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. 2018లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. భరత్ అనే నేను చిత్రంతో సక్సెస్ ను అందుకుని హీరో రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో అవకాశం దక్కించుకుంది.

అయితే వినయ విధేయ రామ ఆశించిన మేరకు విజయం సాధించకపోవడంతో మరలా తిరిగి టాలీవుడ్ ఇండస్ట్రీలో కనిపించలేదు. ఇప్పుడు ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రాబోతున్న  Rc15 లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ Rc15 చిత్రానికి సర్కారోడు పేరు పెట్టినట్లు వార్త వినిపిస్తోంది.

Kiara Advani reportedly celebrated her birth day with siddharth
Kiara Advani

ఈ బ్యూటీ తాజాగా హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  అంతేకాకుండా వీళ్లిద్దరూ సీక్రెట్ గా కాపురం పెట్టేశారు అనే టైంలో బ్రేకప్ చెప్పుకున్నారు అనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక ఇటీవలే లైగర్ బ్యూటీ అనన్య పాండే కూడా వీరిద్దరి రిలేషన్ షిప్ పై కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా కియారా అద్వానీ తన 30వ పుట్టిన రోజును దుబాయ్ లో గ్రాండ్ గా జరుపుకుంది. ఈ పుట్టినరోజు వేడుకలలో కియారా అద్వానీతోపాటు సిద్ధార్థ్ మల్హోత్రా కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వీటికి సంబంధించిన ఫోటోలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. వీళ్ల బ్రేకప్ విషయంలో నిజమెంతో తెలియాలంటే,  ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే. అప్పుడు గానీ అందరిలో ఉన్న ఈ సస్పెన్స్ కి బ్రేక్ పడదు. మ‌రి వీరిద్ద‌రూ ఏం చేస్తారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now