Pokiri Movie : రీ రిలీజ్ అయిన పోకిరి సినిమా ఎంత వ‌సూలు చేసిందో తెలిస్తే.. షాక‌వుతారు..

August 12, 2022 10:21 AM

Pokiri Movie : తెలుగు తెరపై ప్రేక్షకులకు ఓ రాముడిగా, కృష్ణుడిగా ముందు గుర్తుకు వచ్చేది నందమూరి తారక రామారావు. తెలుగు తెరపై రికార్డులు క్రియేట్ చేసిన నందమూరి తారక రామారావు నటుడిగానే కాదు, దర్శకుడిగా కూడా మంచి ప్రతిభను చూపించారు. 1977లో ఎన్టీఆర్ నటించి దర్శకత్వం వహించిన చిత్రం దానవీరశూరకర్ణ. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, కర్ణుడుగా త్రిపాత్రాభినయం చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

అప్పట్లో ఈ చిత్రం 10 లక్షల రూపాయల కన్నా తక్కువ బడ్జెట్ తో రూపొంది బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి కోటి రూపాయలకు పైగా వసూళ్ల‌ను రాబట్టింది. మరలా ఈ చిత్రం తిరిగి 17 ఏళ్ల తర్వాత అంటే 1994లో భారీ ఎత్తున విడుదలై 60 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు కోటి రూపాయలకుపైగా ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. అప్పటి తరంలో ఎన్టీఆర్ క్రియేట్ చేసిన రికార్డుని ఈ తరంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి కూడా ఇలాంటి రికార్డునే క్రియేట్ చేసింది.

do you know how much Pokiri Movie collected during re release
Pokiri Movie

ఈ ఆగస్టు 9న సాయంత్రం రీ రిలీజ్ చేసిన పోకిరి సినిమా స్పెషల్ ప్రీమియర్లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ అయిన పోకిరి చిత్రం ఒక ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోనే ఆరు లక్షల రూపాయల వసూళ్ల‌ను రాబట్టింది అంటే మామూలు విషయం కాదు. పోకిరి చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా 200 థియేటర్ లలో విడుదల చేశారు.

ట్రేడ్ వర్గాల అభిప్రాయం ప్రకారం పోకిరి చిత్రం మూడు కోట్లకుపైగానే కలెక్షన్లు రాబట్టింద‌ని తెలుస్తోంది. దానవీరశూరకర్ణ తర్వాత మరలా అదే స్థాయిలో పోకిరి చిత్రం రికార్డులను సృష్టించింది. ఈ తరహాలో రీ రిలీజ్ అయిన ఘరానా మొగుడు, తొలిప్రేమ చిత్రాలు కూడా పోకిరి చిత్రం స్థాయిలో రికార్డుల‌ను క్రియేట్ చేయలేకపోయాయి. దీన్ని బట్టి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రానికి ఉన్న సత్తా ఏంటో వేరే చెప్పాల్సిన ప‌నిలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment