Anjali : హీరోయిన్ అంజ‌లి.. ఇలా మారిపోయిందేమిటి ? ఏమైంది ?

August 12, 2022 9:23 AM

Anjali : న‌టి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంజలి తమిళ సినిమా షాపింగ్ మాల్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ సినిమా తర్వాత తమిళ్‌తో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. హోమ్లీ పాత్రలతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ భామ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 2013లో సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోనూ న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో నటించిన అంజలి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

తాజాగా కొన్ని ఫోటోలను అంజ‌లి తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. ఆ ఫోటోలను చూస్తుంటే ఫోటోల‌లో ఉన్నది ఎవరు ? మనం ఇప్పటివరకు చూసిన అంజలి యేనా ? ఆమె రూపం ఇంత గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఏంటి ? సైజ్ జీరో పేరుతో ఆమె ఇంతలా బక్క చిక్కిపోయింది ఏంటి ? అని ప్రతి ఒక్కరూ షాక‌వుతున్నారు.

what happened to Anjali how she is changed like that
Anjali

అంజలి లేటెస్ట్ ఫోటోల‌ను చూడగానే అందరిలోనూ చాలా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అంజలి అంటేనే ఒకప్పుడు కాస్త లావుగా ఒళ్ళు చేసి బొద్దుగా ఉండేది. అలాంటి అంజలి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. తమిళ హీరో జైతో చాలాకాలం ఆమె సహజీవనం చేసింది. ఆ తర్వాత ఏమైందో కానీ వీరిద్దరూ బ్రేకప్ చెప్పేసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు. చాలా రోజుల తర్వాత అంజలికి తెలుగులో ఐటమ్‌ సాంగ్ లో చేసే అవకాశం వచ్చింది.

నితిన్ హీరోగా తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో అంజలి ఐటమ్ సాంగ్ ఒక ఊపు ఊపింది. రా రా రెడ్డి అనే పాటకి మంచి రెస్పాన్స్ వస్తోంది. లేటెస్ట్ ఫోటోలో స్లిమ్ లుక్‌ లో ఆమె అందం రెట్టింపు అయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోల‌ను చూస్తుంటే అంజలి ప్రస్తుతం కుర్ర హీరోయిన్లకు పోటీగా అవకాశాలు దక్కించుకుంటుందో లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment