బజ్జీలతో ఘాటెక్కిస్తున్న శ్రీరెడ్డి.. హల్ చల్ చేస్తున్న లేటెస్ట్ వీడియో..

August 19, 2022 2:29 PM

సంచలన తార శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె క్యాస్టింగ్ కౌచ్ ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. అయితే ఈ ఉద్యమం ద్వారా వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డికి సినీ అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. ప్రస్తుతం వివాదాలకు దూరంగా ఉంటూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో రకరకాల వంటకాలను చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను అప్‌లోడ్ చేస్తోంది. అంతేకాకుండా శ్రీరెడ్డి చేసిన వంటకాలకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్నాయి.

ఈ కుకింగ్ వీడియోల‌లో కూడా శ్రీరెడ్డి కాస్త డోస్ పెంచుతూనే ఉంది. ఒక‌వైపు త‌న అందాల‌ని ఆర‌బోస్తూనే మ‌రోవైపు ప‌లు విష‌యాల గురించి మాట్లాడుతూ ఆస‌క్తి పెంచుతోంది. తాజాగా ఈ అమ్మడు బ‌జ్జీలతో వెరైటీ వంట‌కం చేసింది. పెద్ద పెద్ద బ‌జ్జీల‌ను రుచికరంగా చేసి అంద‌రికి నోరూరేలా చేసింది. శ్రీరెడ్డి చేసిన ఈ వీడియోలో బ‌జ్జీ రంగు, త‌న చీర రంగు ఒక‌టిగానే ఉంది. ఘాటు మిర్చి కారం క‌న్నా శ్రీరెడ్డి కారం కాస్త ఎక్కువ‌గా ఉంద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. శ్రీరెడ్డి తాజాగా చేసిన ఈ వంట‌కం వీడియో ప్ర‌స్తుతం నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

sri reddy made mirchi bajji viral video

శ్రీరెడ్డి ఆయా ప్రాంత‌పు వంట‌కాన్ని బ‌ట్టి ఆయా స్టైల్‌లో మాట్లాడుతూ ఉంటుంది. తన స్నేహితులు ఎవరైనా ఇంటికి వస్తే రుచిగా వండి వడ్డించడం ఆమె అలవాటు. ఇలా శ్రీరెడ్డి స్పైసీ రెసిపీస్ లిస్ట్‌లో చికెన్, మటన్, గోంగూర చికెన్, రోటి బెండకాయ పచ్చడి, రాగి సంగటి, మురుగన్ దాల్ విత్ పెసరట్టు, డైట్ చికెన్, పులిహోర ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె వంటకాల లిస్ట్ పెద్దదే అని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now