ఫ్రెండ్ షిప్ అంటే ఇలా కూడా ఉంటుందా.. రాహుల్‌, అషు రెడ్డి ఫొటోలపై నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు..

August 19, 2022 2:24 PM

రాహుల్ సిప్లిగంజ్ యూట్యూబ్ సింగర్ గా ఎంతో మందికి సుపరిచితుడే. బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొని కంటెస్టెంట్స్ అందరినీ నెట్టుకొని ఫైనల్ గా శ్రీముఖితో హోరాహోరీ పోటీలో విన్నర్ గా బిగ్ బాస్ సీజన్ 3  టైటిల్ ని తన కైవసం చేసుకున్నాడు రాహుల్. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం సైలెంట్ గా ఉమెన్ కంటెస్టెంట్స్ తో ముచ్చటలాడుతూ రొమాన్స్ చేసేవాడు. బిగ్ బాస్ 3 సీజన్ లో హీరోయిన్ పునర్నవితో రిలేషన్.. హౌస్ లో ఎంతో హైలెట్ గా నిలిచింది. పునర్నవి, రాహుల్ తరహా చూస్తూ ఉంటే ఇద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారా అన్నట్లు అందరికీ అనుమానం కలిగించింది.

ఇద్దరి మధ్య ఏర్ప‌డిన‌ రిలేషన్ కారణంగానే ఫైనల్ టాప్ త్రీ పొజిషన్ కి చేరుకోగలిగారు. ఫైనల్ కు ముందే పునర్నవి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఎలిమినేట్ అయిన తర్వాత కూడా రాహుల్ కోసం క్యాంపెయిన్ నిర్వహించి అందరి దృష్టినీ ఆకర్షించింది. పునర్నవి, రాహుల్ వివాహం చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా బాగానే చక్కర్లు కొట్టాయి. బిగ్ బాస్ హౌస్ లో పునర్నవితోనే కాకుండా అషురెడ్డితో కూడా మంచి రిలేషన్ మెయింటెన్ చేసేవాడు రాహుల్.

netizen comments on latest photo of rahul and ashu reddy

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత పునర్నవి రాహుల్‌తో రిలేషన్ ను పక్కకు నెట్టేయ‌గా.. అషు రెడ్డి, రాహుల్ రిలేషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా పార్టీల‌లో సెలబ్రేట్ చేసుకుంటూ ఇద్దరూ క్లోజ్ గా ఉండడం, వారి పర్సనల్ ఫొటోస్ సైతం వైర‌ల్ కావ‌డంతో.. అవి నెటిజన్లు ఎంతగానో ఆకర్షించాయి. ఇద్దరి తరహా చూస్తుంటే వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తున్నట్లు ప్రవర్తించేవారు.

అయితే తాజాగా రాహుల్ తన సోషల్ మీడియా వేదికగా అషు రెడ్డిలో కలిసి ఉన్న ఫోటోల‌ని షేర్ చేస్తూ హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే తోపాటు రెడ్ హార్ట్ సింబల్ కూడా జోడించి పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో అషు రెడ్డి.. రాహుల్ ఒడిలో కూర్చొని ఉంది. ఈ ఫోటో కాస్తా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ నెటిజన్ల‌ కంట్లో పడింది. ఫ్రెండ్స్ అయితే మరి ఇలా ఒడిలో కూర్చొని ఫొటోస్ దిగాలా.. అంటూ కామెంట్స్ రూపంలో ట్రోల్ చేస్తున్నారు. కేవలం పబ్లిసిటీ కోసమే వీళ్లు చేస్తున్న యాక్టింగ్.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనప్పటికీ అషు రెడ్డి, రాహుల్ వ్యవహారం ఇప్పుడు  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment