వామ్మో.. ఒక్క సినిమాకు న‌య‌న‌తార తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్ తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు..

August 19, 2022 2:16 PM

లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలే ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండేవి. వీటన్నింటికీ తెర దించుతూ ఎట్టకేలకు నయన్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకుని అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టింది. కొన్ని రోజులు భర్తతో హనీమూన్ కి వెళ్లి వచ్చిన అనంతరం మళ్లీ షూటింగ్ లో బిజీ అయింది నయనతార.

అయితే ప్రస్తుతం నయన్ రెమ్యూనరేషన్ గురించి చర్చ జరుగుతోంది. బాలీవుడ్‌కి చెందిన దీపికా పదుకొనె, ఆలియా భట్‌లను అధిగమించి దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే సూపర్‌స్టార్ నటిగా ఆమె  అవతరించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ జీ స్టూడియోస్ క్రియేటివ్ డైరెక్టర్ ఎస్ శంకర్ శిష్యుడైన నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం నయనతారతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.

do you know how much remuneration Nayanthara taking for one movie

ఈ చిత్రం కోసం నయనతార రూ.10 కోట్లను తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు దీపికా పదుకొనె, ఆలియా భట్ ప్రధాన పాత్ర పోషించవలసి వస్తే ఒక్కో ప్రాజెక్ట్‌కి రూ.8-10 కోట్ల వరకు వసూలు చేస్తున్నారు. కానీ నయనతార రూ.10 కోట్లు తీసుకొని వారి కంటే ముందుండడం గమనార్హం. మెగాస్టార్ చిరు గాడ్ ఫాదర్, ప్రేమమ్ దర్శకుడి తదుపరి చిత్రం గోల్డ్ వంటి తన కమర్షియల్ ప్రాజెక్ట్‌ల కోసం నయన్ రూ.4-5 కోట్ల వరకు వసూలు చేస్తుండగా, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అంత మొత్తాన్ని డిమాండ్ చేస్తోంది.

నయన్ సక్సెస్‌ మూవీస్ తమిళ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.20 కోట్ల షేర్ ను వసూలు చేయడం, ఇతర హక్కులతో కలిపి  నిర్మాతలు మరో రూ.20-30 కోట్లను సులభంగా పొందడంతో నయన్ అడిగిన మొత్తాన్ని ఇస్తున్నారట. ఒక హీరోయిన్ రూ.10 కోట్లు తీసుకోవడం అనేది గొప్ప విషయం. అందుకే అభిమానులు దట్ ఈజ్ నయన్ అని అభినందిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment