షార్ట్ వీడియోస్ కింగ్ టిక్ టాక్.. మళ్లీ ఇండియాలోకి రానుంది..!

August 6, 2022 7:06 PM

చైనీస్ యాప్ టిక్ టాక్ షార్ట్‌ వీడియోస్‌ ప్లాట్‌ ఫామ్ విభాగంలో అతి తక్కువ సమయంలోనే ఎంతగా సక్సెస్‌ అయ్యిందో అందరికి తెలిసిందే. అప్పట్లో యూత్ అంతా టిక్ టాక్ వీడియోలు చేస్తూ తెగ ఎంజాయ్ చేసే వాళ్ళు. అయితే 2020 సంవత్సరంలో మోడీ ప్రభుత్వం అశ్లీలత, సంస్కతి, సంప్రదాయాలను దెబ్బ తీసేలా టిక్ టాక్ వీడియోలు ఉన్నందున దానిపై నిషేధం విధించాలని కొందరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవడంపై నిషేధం విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

టిక్ టాక్ ను బ్యాన్ చేయడంతో అప్పట్లో టిక్ టాక్ మీద ఆధారపడ్డ వారు ఆవేదన వ్యక్తం చేశారు. టిక్ టాక్ పోయిన తర్వాత ఇన్‌ స్టా గ్రామ్‌ రీల్స్ కు అలవాటు పడ్డారు. టిక్ టాక్ తర్వాత ఎన్నో యాప్స్‌ కూడా షార్ట్‌ వీడియో స్ట్రీమింగ్ ల‌ను తీసుకొచ్చాయి. దీంతో ఇప్పుడు టిక్ టాక్ ను జనాలు మర్చిపోయారు.

short videos app tiktok may return entry in india

అయితే టిక్ టాక్ బ్యాన్ అయిన రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ టిక్ టాక్ వస్తోంది అంటూ ప్రచారం జరుగుతోంది. ముంబైకి చెందిన స్కైప్‌ స్పోర్ట్స్ అనే సంస్థ టిక్ టాక్ మాతృసంస్థ అయిన బైట్ డ్యాన్స్ తో చర్చలు జరిపిందట. దీంతో త్వరలోనే ఇండియాలో మళ్లీ టిక్ టాక్ షార్ట్‌ వీడియోలను స్ట్రీమింగ్‌ చేయబోతున్నాం అంటూ వార్తలు వస్తున్నాయి. టిక్ టాక్ కనుక మళ్లీ వస్తే.. ఒకప్పటి ఆదరణ ఉంటుందో లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment