క‌సాయి తల్లి.. 4 ఏళ్ల త‌న చిన్నారిని 4వ అంత‌స్తు నుంచి కింద ప‌డేసి చంపేసింది..

August 6, 2022 1:01 PM

కర్ణాటకలోని బెంగుళూరులో వికలాంగురాలైన నాలుగేళ్ల చిన్నారిని నాలుగ‌వ అంతస్తు నుంచి తోసేసి చంపేసింది ఓ కన్న‌ తల్లి. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఎస్‌ఆర్‌ నగర్‌ ప్రాంతంలో ఉన్న‌ ఓ అపార్ట్‌మెంట్‌లో కిరణ్‌, సుష్మ భరద్వాజ్ అనే దంపతులు నివసిస్తున్నారు. భర్త కిరణ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాగా, భార్య సుష్మ డెంటిస్ట్. వీరికి నాలుగేళ్ల కూతురు ఉంది.

ఈ చిన్నారి ఎదుగుదల పుట్టినప్పటి నుంచి సరిగా లేదు. చిన్నారి మాట్లాడలేదు. మెదడు ఎదుగుదల సరిగా లేని బాలిక పరిస్థితిని చూసి ఆమె తల్లి సుష్మ తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు సమాచారం. దీంతో శుక్ర‌వారం సాయంత్రం తల్లి సుష్మ తన ఇంటి నాలుగో అంతస్తు బాల్కనీలో తన బిడ్డను చేతుల్లో పట్టుకుని నిల్చుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా నాలుగో అంతస్తు నుంచి చిన్నారిని కిందకు తోసేసింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.

mother killed her 4 year old daughter by throwing her from 4th floor

నిందితురాలు సుష్మా భరద్వాజ్ తన బిడ్డను విసిరివేసిన అనంతరం ఆమె కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింద‌ని, అయితే ఇరుగుపొరుగు వారు రక్షించారని పోలీసులు తెలిపారు. సుష్మా భర్త కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. గతంలో కూడా సుష్మ భరద్వాజ్ తన కూతురిని రైల్వే స్టేషన్‌లో వదిలేసి వెళ్లేందుకు ప్రయత్నించింది. విషయం తెలుసుకున్న కిరణ్ వెంటనే స్టేషన్‌కు చేరుకుని తమ కుమార్తెను గుర్తించాడ‌ని పోలీసులు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now