అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడ‌మ్ ఫెస్టివ‌ల్ సేల్‌.. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌ల‌పై భారీ డిస్కౌంట్లు..

August 5, 2022 10:39 PM

ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని గ్రేట్ ఫ్రీడ‌మ్ ఫెస్టివ‌ల్ సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఈ సేల్ ప్రైమ్ మెంబ‌ర్ల‌కు ఇప్పటికే ప్రారంభం అయింది. ఇక ఆగ‌స్టు 6 నుంచి 10వ తేదీ వ‌ర‌కు ఈ సేల్ కొన‌సాగ‌నుంది. ఇందులో మొబైల్స్‌పై 40 శాతం, ల్యాప్‌టాప్ లు, హెడ్ ఫోన్స్‌, స్మార్ట్ వాచ్ ల‌పై 75 శాతం, టీవీలు, గృహోప‌క‌ర‌ణాలు, ఇత‌ర వ‌స్తువుల‌పై ఏకంగా 60 శాతం వ‌ర‌కు డిస్కౌంట్ల‌ను అందిస్తున్నారు.

ఈ సేల్‌లో భాగంగా యాపిల్‌కు చెందిన ఐఫోన్ 13 ఫోన్‌ను రూ.11వేల త‌గ్గింపు ధ‌రతో రూ.68,900కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. అలాగే వ‌న్ ప్ల‌స్ 10 ప్రొ 5జి ఫోన్‌ను రూ.5వేల త‌గ్గింపుతో రూ.61,999కు, ఐక్యూ 9 ప్రొ 5జి ఫోన్‌ను రూ.5వేల త‌గ్గింపుతో రూ.55,990 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. అలాగే షియోమీ 12 ప్రొ రూ.5వేల త‌గ్గింపుతో రూ.51,999 ధ‌ర‌కి ల‌భిస్తోంది. అదేవిధంగా ఐక్యూ 95జి, షియోమీ 11టి ప్రొ, శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జి, ఐక్యూ 9ఎస్ఈ 5జి, ఐక్యూ జ‌డ్‌6 ప్రొ 5జి ఫోన్ల‌పై కూడా భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు.

amazon launched great freedom festival sale huge discounts on products

ఇక షియోమీ 11 లైట్ ఎన్ఈ 5జి, వన్‌ప్ల‌స్ నార్డ్ సీఈ 2 లైట్ 5జి, రియ‌ల్‌మి నార్జో 50, రెడ్‌మీ నోట్ 11 ఫోన్ల‌పై కూడా త‌గ్గింపు ధ‌ర‌ల‌ను పొంద‌వ‌చ్చు. ట్యాబ్‌లెట్ల‌పై 50 శాతం, ల్యాప్‌టాప్‌ల‌పై రూ.40వేల వ‌ర‌కు, టీవీల‌పై 60 శాతం, స్మార్ట్ ఫోన్ కేసెస్‌పై 70 శాతం, హెడ్ ఫోన్స్‌పై 75 శాతం, కెమెరాలు, ప్రింట‌ర్లు, గేమింగ్ యాక్స‌స‌రీలు, స్పీక‌ర్లు, డేటా స్టోరేజ్ డివైస్‌లు, హై స్పీడ్ రూట‌ర్లు, కంప్యూట‌ర్ కాంపొనెంట్స్‌, సౌండ్ బార్స్‌, మానిట‌ర్స్‌, వైఫై స్మార్ట్ హోమ్ సెక్యూరిటీ కెమెరాలు, అలెక్సా, ఫైర్ టీవీ డివైస్‌లు, కిండిల్ ఇ-రీడ‌ర్స్ త‌దిత‌ర ఉత్ప‌త్తుల‌పై 45 నుంచి 80 శాతం వ‌ర‌కు రాయితీల‌ను అందిస్తున్నారు.

ఈ సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల‌తో వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. అదే డెబిట్ కార్డుల‌తో అయితే రూ.5వేల వ‌ర‌కు డిస్కౌంట్‌ను ఇస్తారు. దీంతోపాటు ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment