సమంత అంటే బోర్‌ కొట్టేసిందన్న నాగచైతన్య.. ఫ్యాన్స్‌కు స్పెషల్‌ రిక్వెస్ట్‌..

August 5, 2022 6:52 PM

నాగచైతన్య, సమంత గతేడాది అక్టోబర్‌లో విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. అంతకు ఒక నెల ముందే సమంత తన సోషల్‌ ఖాతాల్లో తన పేరు చివరన ఉన్న అక్కినేని అనే ఇంటి పేరును తొలగించి ఆంగ్ల అక్షరం ఎస్‌ ను చేర్చింది. దీంతో ఇద్దరూ విడిపోతున్నారని వార్తలు వచ్చాయి. చివరకు అవే నిజమయ్యాయి. వారు విడిపోతున్నామని సోషల్‌ మీడియా వేదికగా తమ తమ ఖాతాల ద్వారా ప్రకటించారు. అయితే వీరు ఎందుకు విడిపోయారు.. అన్న కారణాలు తెలియదు కానీ.. సమంతతో ఇంకా తనకు లింక్‌ పెట్టి చెప్పడాన్ని చైతూ సహించలేకపోతున్నాడట. ఈ మేరకు చైతన్య చేసిన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

ఇటీవల చైతన్య ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విడాకుల తరువాత నా సినిమాలు మూడు రిలీజ్‌ అయ్యాయి. నేను ఇంకా సినిమాలకే అటాచ్‌ అయి ఉన్నా. నాకు సమంతతో లింక్‌ పెట్టడం ఏమీ బాగా లేదు. మేం విడాకులు తీసుకున్నాం. నన్ను, సమంతను కలిపి చెబుతూ వస్తున్న వార్తలతో విసిగిపోయా. నాకు బోరింగ్‌గా ఉంది. అలాంటి వార్తలు ఇక రాయొద్దని కోరుతున్నా.. అంటూ చైతూ ప్రత్యేక రిక్వెస్ట్‌ చేశాడు. ఈ క్రమంలోనే చైతన్య చేసిన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

Naga Chaitanya said do not put news about him and Samantha

కాగా నాగచైతన్య నటించిన థాంక్‌ యూ మూవీ ఇటీవలే రిలీజ్‌ కాగా.. బాక్సాఫీస్‌ వద్ద ఈ మూవీ ఘోర పరాజయం పాలైంది. తీవ్రంగా నిరాశపరిచింది. రెండో రోజే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. అయితే ఈ నెల 11వ తేదీన చైతూ నటించిన లాల్‌ సింగ్‌ చడ్డా అనే మూవీ రిలీజ్‌ కానుంది. ఇందులో చైతూ ఆర్మీ ఆఫీసర్‌గా, అమీర్‌ఖాన్‌ ఫ్రెండ్‌గా కనిపించనున్నాడు. చైతూ రోల్‌ ఇందులో సుమారుగా 15 నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తోంది. చైతూ పాత్ర పేరు ఇందులో బాలరాజు. కాగా ఫారెస్ట్‌ గంప్‌ అనే ఇంగ్లిష్‌ మూవీకి రీమేక్‌గా ఈ మూవీని నిర్మించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment