---Advertisement---

Mallika Sherawat : హీరో తెల్లవారుజామున 3 గంట‌ల‌కు పిలిచినా వెళ్లాల్సిందే.. దుమారం రేపుతున్న హీరోయిన్ వ్యాఖ్య‌లు..

August 3, 2022 12:44 PM
---Advertisement---

 Mallika Sherawat : బాలీవుడ్ బ్యూటీ మ‌ల్లికా శెరావ‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో నిలిచింది. హీరోలు తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు పిలిచినా వెళ్లాల్సిందేన‌ని.. లేక‌పోతే సినిమా నుంచి తీసేస్తార‌ని.. సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. బాలీవుడ్‌పై ఆమె చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఫిలిం ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంద‌ని ఇప్ప‌టికే ఎంతో మంది హీరోయిన్లు గ‌ళం విప్పారు. ఇప్పుడు వారి స‌ర‌స‌న మ‌ల్లికా శెరావ‌త్ చేరింది. ఆమె తాజాగా ఓ ఆంగ్ల మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో షాకింగ్ విష‌యాల‌ను తెలియ‌జేసింది.

మ‌ర్డ‌ర్ మూవీ ద్వారా ఫేమ‌స్ అయిన మ‌ల్లికా శెరావ‌త్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ మూవీ అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. త‌రువాత కూడా మ‌ల్లికా అలాంటి పాత్ర‌ల్లోనే న‌టించింది. అయితే ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. దీపికా ప‌దుకొనె ఇటీవ‌ల న‌టించిన గెహ్రాయియా చిత్రాన్ని తానెప్పుడో 15 ఏళ్ల కింద‌టే చేశాన‌ని చెప్పింది.

 Mallika Sherawat sensational comments on Bollywood heroes
Mallika Sherawat

బాలీవుడ్‌లో ఎ-లిస్ట‌ర్ హీరోలు ఏం అడిగినా కాంప్ర‌మైజ్ అవ‌కూడ‌దు. ఒకవేళ కాంప్ర‌మైజ్ కాక‌పోతే ప‌రిస్థితులు మ‌రోలా ఉంటాయి. ఇక్క‌డ మ‌రోలా అంటే.. అర్థం ఏమిటో మీరు ఊహించుకోవ‌చ్చు. అదే కాంప్ర‌మైజ్ అయితే వారి సర్కిల్‌లో ఉంటారు. వారి సినిమాల్లో అవ‌కాశాలు వ‌స్తాయి. వారు నిల‌బ‌డ‌మ‌న్నా, కూర్చోమ‌న్నా, ఏం చెప్పినా చేయాలి. హీరో తెల్ల‌వారు జామున 3 గంట‌ల‌కు పిలిచినా స‌రే వెళ్లాలి. లేదంటే సినిమా నుంచి తీసేస్తారు. త‌రువాత అవ‌కాశాలు కూడా రావు.. అంటూ మ‌ల్లికా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

కాగా మ‌ల్లికా శెరావ‌త్ త‌న కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన రోల్స్‌లో న‌టించింది. చాలా వ‌ర‌కు ఈమె చేసిన‌వ‌న్నీ బోల్డ్ పాత్ర‌లే. ఇక ఆమె ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్ జాకీ చాన్‌తో ఒక సినిమాలో న‌టించింది. అలాగే అమెరికా అప్ప‌టి అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామాను రెండు సార్లు క‌లిసే చాన్స్ ను ద‌క్కించుకుంది. అయితే మ‌ల్లికా శెరావ‌త్ ఇప్పుడు సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డంతో ఆమె మ‌రోమారు వార్త‌ల్లో నిలిచింది. దీనికి బాలీవుడ్ వ‌ర్గాలు ఏమ‌ని స్పందిస్తాయో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now