Pushpa 2 : పుష్ప 2 కి అల్లు అర్జున్‌, సుకుమార్‌ల రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా ? దిమ్మ‌తిరిగిపోతుంది..!

August 1, 2022 5:26 PM

Pushpa 2 : అల్లు అర్జున్‌, ర‌ష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పుష్ప మూవీ ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ మూవీ వ‌ల్ల అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఈ సినిమా హిందీ మార్కెట్‌లోనే కాకుండా విదేశీ మార్కెట్‌లోనూ భారీగానే వ‌సూలు చేసింది. అన్ని భాష‌ల్లోనూ క‌లిపి రూ.360 కోట్ల గ్రాస్‌ను క‌లెక్ట్ చేసింది. దీంతో పుష్ప 2 ను మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇక పుష్ప 2 బ‌డ్జెట్ రూ.350 కోట్లు అవుతుంద‌ని సమాచారం.

ఇక పుష్ప 2కు గాను ఇప్ప‌టికే స్క్రిప్ట్ ప‌నిని పూర్తి చేశార‌ని తెలుస్తోంది. కానీ అందులో మ‌ళ్లీ మార్పులు చేస్తున్నార‌ట‌. అందువ‌ల్ల షూటింగ్ కు ఇంకా ఆల‌స్యం అవుతోంది. కాగా పుష్ప 2 చిత్రానికి కేటాయించిన బ‌డ్జెట్‌లో 60 శాతం హీరో, ద‌ర్శ‌కుడిదే ఉండ‌డం విశేషం. పుష్ప 2 మూవీకి గాను అల్లు అర్జున్ ఏకంగా రూ.120 కోట్లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే ద‌ర్శ‌కుడు సుకుమార్ రూ.80 కోట్లు తీసుకుంటున్నాడ‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

do you know the remuneration of allu arjun and sukumar for pushpa 2
Pushpa 2

అయితే అల్లు అర్జున్ పుష్ప మొద‌టి పార్ట్‌కు రూ.30 కోట్లు తీసుకుని ఇప్పుడు దాన్ని అమాంతం రూ.120 కోట్లకు పెంచ‌డం నిజంగానే ఆశ్చర్యాన్ని క‌లిగిస్తుంద‌ని అంటున్నారు. ఇక సుకుమార్ ఒక మూవీకి గ‌రిష్టంగా రూ.15 కోట్లు తీసుకునేవారు. కానీ దానికి 6 రెట్ల రెమ్యున‌రేష‌న్‌ను ఇప్పుడు పొందుతున్నారు. దీంతో వీరిద్ద‌రి పారితోషిక‌మే సినిమా బ‌డ్జెట్‌లో 60 శాతంగా ఉండ‌డం విశేషం.

ఇక ఆగ‌స్టు చివ‌రి వారం నుంచి పుష్ప 2 రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్లు తెలుస్తోంది. అయితే అన్ని సినిమాల షూటింగ్‌ల‌ను నిలిపివేయాల‌ని ఇప్ప‌టికే టాలీవుడ్ నిర్మాత‌ల మండలి నిర్ణ‌యం తీసుకుంది. అందువ‌ల్ల షూటింగ్‌కు అంత‌రాయం క‌లుగుతుంద‌ని తెలుస్తోంది. ఇక ఇప్ప‌టికే ప్రారంభం కావ‌ల్సిన మ‌హేష్, త్రివిక్ర‌మ్ మూవీ సైతం వాయిదా ప‌డింది. దీంతో మళ్లీ షూటింగ్స్‌ ఎప్పుడు మొద‌ల‌వుతాయ‌నేది సందేహంగా మారింది. ఇక పుష్ప 2 ను కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయ‌నున్నారు. దీంట్లో సునీల్‌, అన‌సూయ‌, ఫ‌హాద్ పాజిల్‌, విజ‌య్ సేతుప‌తి కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. 2023లో ఈ మూవీ రిలీజ్ కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment