Sindhu Tolani : మన్మథ హీరోయిన్‌ సింధు తులాని ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక‌వుతారు..!

July 30, 2022 6:25 PM

Sindhu Tolani : చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో ఐతే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సింధు తులాని ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మెప్పించింది. తమిళంలో శింబుతో చేసిన మన్మథ సినిమాతో ఆమె యూత్ ఆడియెన్స్ కి హాట్ ఫేవరెట్ అయ్యింది. బక్క పలచని ఈ భామ తన అందచందాలతో ఆడియెన్స్ ని అలరించింది. తెలుగులో అతనొక్కడే, గౌతమ్ ఎస్.ఎస్.సి, హరే రామ్, బతుకమ్మ సినిమాల్లో లీడ్ రోల్ లో నటించింది సింధు తులాని.

ఇక హీరోయిన్ గా కెరియర్ ముగిసింది అనుకున్న అమ్మడు వదిన, అక్క పాత్రలతో అలరిస్తూ వస్తోంది. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా సినిమాలు చేస్తూ వచ్చిన సింధు తులాని అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించింది. ఆ తర్వాత ధనలక్ష్మి తలుపు తడితే, చిత్రాంగద‌ సినిమాల్లోనూ నటించింది సింధు తులాని. ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు ఈమధ్య ఎక్కడా కనిపించడం లేదు. అయితే సడెన్ గా తన లేటెస్ట్ ఫోటో షూట్స్ తో అందరికీ షాక్ ఇచ్చింది.

do you know how Sindhu Tolani is now see latest photos
Sindhu Tolani

బొద్దుగా మారి ఆడియెన్స్ కి షాక్ ఇచ్చింది సింధు. దాదాపు ఐదు సంవత్సరాలుగా ఆమె సినిమాల్లో నటించలేదు. ఆ టైం లో కంప్లీట్ గా ఫ్యామిలీ ఉమ‌న్ గా మారిపోయినట్టు ఉంది. అందుకే గ్లామర్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదని అనిపిస్తోంది. ఇక లేటెస్ట్ లుక్స్ తో ఆడియెన్స్ ని సర్ ప్రైజ్ చేసింది సింధు తులాని. హీరోయిన్ గా కెరియర్ ముగిసినా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న సింధు కెరియర్ లో అనుకోని గ్యాప్ వచ్చే సరికి ఇలా లావెక్కిందని చెప్పొచ్చు. చూస్తుంటే మళ్లీ సినిమాల్లో నటించడానికి ఈ అమ్మడు రెడీ అన్నట్టు హింట్ ఇస్తుందని చెప్పొచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment