Trivikram : వామ్మో.. ఒక్క యాడ్ చేసినందుకే.. త్రివిక్ర‌మ్ అంత తీసుకున్నాడా..?

July 27, 2022 8:24 PM

Trivikram : పుష్ప సినిమా స‌క్సెస్ కార‌ణంగా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ను హీరోగా పెట్టి సినిమాలు తీసేందుకు బాలీవుడ్ నిర్మాత‌లు సైతం ఆస‌క్తిని చూపిస్తున్నారు. కానీ వారి క‌ల ఇప్పుడ‌ప్పుడే నెర‌వేర‌దు. ఎందుకంటే బ‌న్నీ ఇప్ప‌టికే తెలుగులో ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు. ఇక పాన్ ఇండియా స్టార్ కావ‌డంతో అల్లు అర్జున్‌ను బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా చేసి ఆయ‌న‌తో యాడ్స్ చేసేందుకు కంపెనీలు పోటీ ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే బ‌న్నీ ప‌లు కంపెనీల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌లా మారాడు. అనేక యాడ్స్‌లోనూ న‌టిస్తున్నాడు. ఇక తాజాగా మ‌రో కంపెనీకి చెందిన యాడ్‌లోనూ బ‌న్నీ న‌టించాడు. ఈ క్ర‌మంలోనే ఆ యాడ్‌కు గాను బ‌న్నీ ధ‌రించిన దుస్తుల‌కు చెందిన ఫొటో వైర‌ల్ అవుతోంది.

ఈ మ‌ధ్యే హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ ఒక యాడ్ చేయ‌గా.. ఇప్పుడు తాజాగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో యాడ్ చేశాడు. ఈ యాడ్ షూటింగ్ కూడా హైదరాబాద్‌లోనే జ‌రిగింది. అందులో భాగంగానే యాడ్ కోసం అల్లు అర్జున్ డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించాడు. త‌ల‌పై టోపీ ధ‌రించాడు. ఇక ఈ యాడ్ త్వ‌ర‌లోనే ప్ర‌సారం కానుంది. అయితే ఈ యాడ్ కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించినందుకు గాను త్రివిక్ర‌మ్ అక్ష‌రాలా రూ.45 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్నార‌ట‌. అది కూడా కొన్ని సెక‌న్ల యాడేన‌ట‌. కానీ భారీ మొత్తంలో త్రివిక్ర‌మ్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇక టాలీవుడ్‌లో రాజ‌మౌళి త‌రువాత అంత‌టి భారీ మొత్తంలో పారితోషికాన్ని తీసుకుంటున్న ద‌ర్శ‌కుల్లో త్రివిక్ర‌మ్ ఒక‌ర‌ని చెప్ప‌వ‌చ్చు.

Trivikram reportedly took huge remuneration for doing one ad
Trivikram

కాగా త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో క‌లిసి బ‌న్నీ చేసిన సినిమాలు అన్నీ హిట్ అయ్యాయి. ఆయ‌న‌తో బ‌న్నీ జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, అల వైకుంఠ‌పుర‌ములో త‌దిత‌ర సినిమాల్లో న‌టించాడు. ఈ మూడు సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ అయ్యాయి. ఇక ప్ర‌స్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్‌లో ఉన్నారు. ఈ మూవీ అనంత‌రం బ‌న్నీ త్రివిక్ర‌మ్‌తో సినిమా చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ మ‌హేష్‌తో సినిమా చేస్తున్నారు. అది పూర్తయ్యాక బ‌న్నీతో సినిమా ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment