---Advertisement---

Today Gold Rate : గుడ్ న్యూస్‌.. త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు..!

July 27, 2022 9:17 AM
---Advertisement---

Today Gold Rate : గ‌త కొంత కాలంగా బంగారం ధ‌రల్లో భారీగా హెచ్చు త‌గ్గులు న‌మోద‌వుతున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో కొంత కాలం పాటు బంగారం ధ‌ర స్థిరంగానే ఉంది. కానీ ఒక్కోసారి భారీగా త‌గ్గుతోంది. ఇక నిన్న మొన్న‌టి వ‌ర‌కు స్థిరంగానే ఉన్న ధ‌ర మ‌ళ్లీ త‌గ్గింది. ఇది మ‌హిళ‌ల‌కు శుభ‌వార్తే అని చెప్ప‌వ‌చ్చు. రానున్న రోజుల్లో ముహూర్తాలు అనేకం ఉన్నాయి. శుభ కార్యాలు జ‌రుపుకునేవారు కూడా ఉన్నారు. దీంతో త‌గ్గుతున్న బంగారం ధ‌రలు వారికి ఎంతో మేలు చేస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. బంగారం కొనాలనుకునే వారు ఇప్పుడే దాన్ని కొనుగోలు చేయ‌డం మంచిద‌ని అంటున్నారు.

ఇక 27 జూలై 2022న బంగారం ధ‌ర‌లు హైద‌రాబాద్‌లో ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.380 త‌గ్గింది. దీంతో రేటు రూ.50,780గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.320 త‌గ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర హైద‌రాబాద్‌లో రూ.46,580గా ఉంది. ఇక వెండి ధ‌ర కూడా బంగారంలాగే ఉంటోంది. ఈ క్ర‌మంలోనే దీని ధ‌ర కిలోకు రూ.300కు ప‌డిపోగా.. ప్ర‌స్తుతం వెండి ధ‌ర కిలోకు రూ.60,800గా ఉంది. గ‌త 4 రోజుల్లోనే వెండి ధ‌ర రూ.800 త‌గ్గడం విశేషం.

27th july 2022 Today Gold Rate in india and telugu states
Today Gold Rate

ఇక విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.46,580గా ఉండ‌గా.. 24 క్యారెట్స్ బంగారం ధర 50,780గా ఉంది. ఈ న‌గ‌రంలో వెండి ధర కిలో రూ. 60,800 వద్ద ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,580 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,780గా కొన‌సాగుతోంది.

అదేవిధంగా చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల‌ బంగారం ధర రూ.47,280గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.51,580గా కొన‌సాగుతోంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,580, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780గా ఉన్నాయి. అలాగే ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,580, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,780గా ఉన్నాయి. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,580, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780, కోల్ కతాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,580గా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే త‌గ్గుతున్న ప‌సిడి ధ‌ర‌లు మ‌హిళ‌ల‌కు ఊర‌ట‌నిస్తున్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now