Bigg Boss Telugu 6 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు గుడ్ న్యూస్.. బిగ్ బాస్ సీజ‌న్ 6 ఎప్ప‌టి నుంచి అంటే..?

July 26, 2022 6:21 PM

Bigg Boss Telugu 6 : బుల్లితెర‌పై అత్యంత స‌క్సెస్ సాధించిన షోల‌లో బిగ్ బాస్ ఒక‌టి. ఈ షోకు గాను ఇప్ప‌టి వ‌ర‌కు 5 సీజ‌న్లు పూర్త‌య్యాయి. తొలి సీజ‌న్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ‌చ్చారు. త‌రువాత నాని రెండో సీజ‌న్ చేశారు. ఇక 3, 4, 5 సీజ‌న్ల‌కు నాగార్జున‌నే వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే 6వ సీజ‌న్‌కు కూడా ఇప్ప‌టికే ఈయ‌న‌నే హోస్ట్‌గా ఎంపిక చేశారు. దీంతో ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో బిగ్ బాస్ సీజ‌న్ 6 ప్రోమో షూటింగ్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇందులో నాగార్జున పాల్గొంటున్నారు.

కాగా బిగ్ బాస్ సీజ‌న్ 6కు గాను ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను ఆగ‌స్టు నెల నుంచి నిర్వ‌హించ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే ఆగస్టు 3వ వారంలో కంటెస్టెంట్ల‌ను ఎంపిక చేసి క్వారంటైన్‌కు త‌ర‌లించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. త‌రువాత సెప్టెంబ‌ర్ మొదటి వారంలో షో ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే కంటెస్టెంట్ల ఎంపిక‌తోపాటు ఇంటి నిర్మాణ ప‌నుల‌ను ప్ర‌స్తుతం చేప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

Bigg Boss Telugu 6 may start in September
Bigg Boss Telugu 6

ఇక ఇటీవ‌లే బిగ్ బాస్ ఓటీటీని కూడా నిర్వ‌హించారు. దీన్ని డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ చేశారు. కానీ దీనికి ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. ఇందులో టాప్ 5 లో నిలిచిన వారిని బిగ్ బాస్ సీజ‌న్ 6కు తీసుకుంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే దీనిపై క్లారిటీ రావ‌ల్సి ఉంది. అలాగే నాగార్జున ప్ర‌స్తుతం ఘోస్ట్ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. ఆయన షూటింగ్‌ను పూర్తి చేశాక బిగ్ బాస్ కార్య‌క్ర‌మాల్లో మ‌రింత చురుగ్గా పాల్గొన‌నున్నారు. ఇక ఆయ‌న ఘోస్ట్ మూవీ అక్టోబ‌ర్ 5వ తేదీన ద‌స‌రా కానుక‌గా రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment