---Advertisement---

Today Gold Rates : గుడ్ న్యూస్‌.. స్థిరంగా కొన‌సాగుతున్న బంగారం ధ‌ర‌లు..!

July 25, 2022 9:55 AM
---Advertisement---

Today Gold Rates : అంత‌ర్జాతీయంగా నెల‌కొన్న ప‌రిస్థితుల‌తోపాటు మ‌న దేశంలో ప‌లు ప‌న్నుల కార‌ణంగా గ‌త కొంత కాలంగా బంగారం ధ‌ర‌ల్లో భారీగా మార్పులు వ‌స్తున్నాయి. ఒక‌సారి భారీగా ధ‌ర పెరిగితే మ‌రోసారి ధ‌ర త‌గ్గుతోంది. దీంతో ఎప్పుడు బంగారం ధ‌ర‌లు ఎలా ఉంటున్నాయో తెలియ‌ని అయోమ‌య ప‌రిస్థితి నెల‌కొంది. ఇక ఆదివారంతో పోలిస్తే సోమ‌వారం బంగారం ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ క్ర‌మంలోనే సోమ‌వారం (25-07-2022) బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సోమ‌వారం మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.46,900 ఉండ‌గా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.51,160గా ఉంది. కాగా బంగారం ధ‌ర గత రెండు రోజుల్లో రూ.1000 పెరిగింది. వెండి రేటు కూడా స్థిరంగానే ఉంది. ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ధ‌ర రూ.61,200 గా ఉంది. ఆదివారం వెండి ధ‌ర రూ.400 ప‌డిపోయింది. గ‌త వారం రోజుల్లో బంగారం ధ‌ర‌లు కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించేవిగా ఉంటున్నాయి. హైదరాబాద్ లో సోమవారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,900గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ.51,160గా ఉంది. అలాగే వెండి రేటు 1 కిలోకు రూ.61,200గా ఉంది.

25 july 2022 Today Gold Rates in telugu states india
Today Gold Rates

విజయవాడ మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల‌కు రూ.46,900గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధ‌ర‌ రూ.51,160గా ఉంది. వెండి ధర రూ.61,200గా ఉంది. ఏపీలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇలాగే ధరలున్నాయి. ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 46,900గా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల‌కు రూ.51,160గా ఉంది. ఢిల్లీలో వెండి రేటు 1 కిలోకు రూ.55,100గా ఉండ‌గా, ఆర్థిక రాజధాని ముంబై, కోల్ కతాలోనూ ఇవే ధరలు ఉన్నాయి. వెండి ధరల్లో ఆదివారంతో పోలిస్తే ఎలాంటి మార్పు లేదు. అలాగే మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.61,200 గా ఉంది. చెన్నై, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.61,200 ఉండగా, ముంబై, కోల్‌క‌తా, ఢిల్లీల‌లో వెండి ధ‌ర కిలోకు రూ. 55,100గా కొన‌సాగుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now