Rajinikanth : అన్నీ ఉన్నా.. జీవితంలో అవి రెండే ల‌భించ‌డం లేదు.. ర‌జ‌నీకాంత్ కామెంట్స్ వైర‌ల్‌..!

July 24, 2022 10:54 PM

Rajinikanth : త‌మిళ న‌టుడు అయిన‌ప్ప‌టికీ ర‌జ‌నీకాంత్ గ్లోబ‌ల్ స్టార్ అన్న విష‌యం విదిత‌మే. ఈయ‌న సినిమాలు జ‌పాన్ వంటి దేశాల్లోనూ ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతుంటాయి. అందుక‌నే ఆయ‌న అంద‌రికీ ప‌రిచ‌యం అయ్యారు. ఇక ర‌జ‌నీకాంత్ ఎల్ల‌ప్పుడూ ఆధ్యాత్మిక భావాల‌ను క‌లిగి ఉంటారు. అందుక‌నే ఆయ‌న త‌రచూ హిమాల‌యాల‌కు వెళ్తుంటారు. ఇక ఈ మ‌ధ్యే ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఆయ‌న ప‌లు కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు. త‌న జీవితంలో ఎన్నో అనుభ‌వించాన‌ని చెప్పిన ఆయ‌న‌.. త‌న‌కు ప్ర‌శాంత‌త మాత్రం క‌రువైంద‌ని అన్నారు. అలాగే ఆనందం అనేది లేకుండా పోయింద‌ని తెలిపారు.

జీవితంలో తాను ఎంత‌గానో పేరు, ప్ర‌ఖ్యాతుల‌ను సాధించాన‌ని ర‌జ‌నీకాంత్ తెలిపారు. అలాగే ఎంతో డ‌బ్బు సంపాదించాన‌న్నారు. కానీ త‌న‌కు ఆనందం, ప్ర‌శాంత‌త అనే రెండు ల‌భించ‌డం లేద‌న్నారు. అవి మ‌నుషుల‌కు దొర‌క‌డం అసంభ‌వం అని ఆయ‌న వైరాగ్య‌పు మాటలు మాట్లాడారు. తాను హిమాల‌యాల‌కు వెళ్తుంటే కాసేపు ఆత్మ సంతృప్తి ల‌భిస్తుంద‌న్నారు. కానీ అది తాత్కాలిక‌మేన‌ని.. ఆనందం, ప్ర‌శాంత‌త అనేవి ఎల్ల‌ప్పుడూ ఉండ‌వ‌ని అన్నారు. అయితే త‌న ప్ర‌వ‌ర్త‌న చూసి కొంద‌రు స‌న్యాసులు అయితే.. కొంద‌రు త‌ర‌చూ హిమాల‌యాల‌కు వెళ్తున్నార‌ని అన్నారు.

Rajinikanth said happiness and peace are not getting to him
Rajinikanth

ఇక ర‌జ‌నీకాంత్ ఈ మ‌ధ్య కాలంలో వ‌రుస ఫ్లాప్ ల‌ను ఎదుర్కొంటున్నారు. ఆయ‌న న‌టించిన 2.0 త‌రువాత ఏ మూవీ కూడా హిట్ కాలేదు. ఈ క్ర‌మంలోనే ర‌జ‌నీ కెరీర్ ఇక ముగిసిన‌ట్లేనని అంటున్నారు. ఇక ఆయ‌న ప్ర‌స్తుతం జైల‌ర్ అనే మూవీలో న‌టిస్తున్నారు. దీనికి నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే ర‌జ‌నీకాంత్ ఆ స్థాయిలో ఉండి కూడా ఇలా మాట్లాడ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఆయ‌న‌కు ఏయే విష‌యాల్లో ఆనందం, ప్ర‌శాంత‌త లేవు.. అని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment