Latha Sri : నాగ‌శౌర్య‌కు, లతాశ్రీ‌కి మ‌ధ్య ఉన్న రిలేష‌న్ ఏమిటి ? అత‌ని గురించి అడిగినా ఎందుకు చెప్ప‌నంటోంది ?

July 15, 2022 10:29 PM

Latha Sri : అప్ప‌ట్లో ఆలీ హీరోగా.. ఎస్‌వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన య‌మ‌లీల మూవీ ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇందులో కైకాల స‌త్య‌నారాయ‌ణ య‌ముడిగా, బ్ర‌హ్మానందం చిత్ర గుప్తుడిగా న‌టించి అలరించారు. అలాగే ఇంద్ర‌జ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. అయితే ఇందులో య‌మున్ని బురిడీ కొట్టించ‌డం కోసం ఆలీ ఒక యువ‌తిని రంగంలోకి దింపుతాడు. ఆ యువ‌తి గుర్తుంది క‌దా.. ల‌తాశ్రీ. అవును.. ఆమె ఈ మూవీలో ప్ర‌త్యేక సాంగ్ కూడా చేసింది. అభివంద‌నం.. అంటూ సాగే ఈ పాట ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

ఇక ల‌తాశ్రీ 70కి పైగా చిత్రాల్లో న‌టించింది. అనేక సినిమాల్లో ఈమె అప్ప‌టి హీరోల‌కు చెల్లెలి పాత్ర‌లో క‌నిపించి అల‌రించింది. అయితే 1999 త‌రువాత ఈమె సినిమా ఇండ‌స్ట్రీకి దూర‌మైంది. ఈ క్ర‌మంలోనే ఈమె తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో పాల్గొని ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించింది. అయితే హీరో నాగ‌శౌర్య మీ మేన‌ల్లుడా అని అడ‌గ్గా.. అందుకు ఆమె అత‌ని గురించి చెప్పేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. తాను ఒక అన్న‌య్య ఉండేవాళ్లం అని మాత్రం చెప్పింది. ఇక నాగశౌర్య త‌న మేన‌ల్లుడ‌ని ఆమె చెప్ప‌క‌నే చెప్పింది. అత‌ని సినిమాల‌ను చూస్తారా.. అని అడిగితే అంద‌రి మూవీల‌ను చూసిన‌ట్లే అత‌ని మూవీల‌ను కూడా చూస్తాన‌ని.. ప్ర‌త్యేకంగా ఏమీ భావించ‌న‌ని స్ప‌ష్టం చేసింది.

Latha Sri not happy on talking about Naga Shaurya
Latha Sri

కాగా నాగశౌర్య కుటుంబంతో ఎందుకు విభేదాలు వ‌చ్చాయి.. వారితో మాట్లాడ‌డం లేదా.. అని అడ‌గ్గా.. అవ‌న్నీ ఇప్పుడెందుకు.. టాపిక్ మార్చండి.. నేను చెబితే దాన్ని మీరు మ‌రో ర‌కంగా రాస్తారు. ఇప్పుడ‌వ‌న్నీ ఎందుకు.. నేను నేనులా జీవించాల‌నుకుంటున్నా.. వారి పేరును వాడుకోవ‌డం ఇష్టం లేదు.. అని ల‌తాశ్రీ స‌మాధానం చెప్పింది. ఈక్ర‌మంలోనే ఈమె ఇచ్చిన ఇంట‌ర్వ్యూ తాలూకు వీడియో ఒక‌టి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment