Dil Raju Son Name : దిల్ రాజు త‌న కొడుక్కి ఏ పేరు పెడుతున్నారో తెలుసా ?

July 14, 2022 8:44 AM

Dil Raju Son Name : ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజ్ ఇటీవ‌లే మరోసారి తండ్రి అయిన విష‌యం విదిత‌మే. త‌న రెండో భార్య తేజ‌స్విని అలియాస్ వైగా రెడ్డి పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. క‌రోనా టైమ్ లో 2020 మే నెల‌లో వీరు వివాహం చేసుకున్నారు. లాక్‌డౌన్ స‌మ‌యం కావ‌డంతో సినీ ప్ర‌ముఖులు, స్నేహితులు లేకుండానే కేవ‌లం కొద్ది మంది కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో వీరు ఓ ఆల‌యంలో పెళ్లి చేసుకున్నారు. దీంతో అప్ప‌ట్లో వైగా రెడ్డి ఫొటోలు వైర‌ల్ అయ్యాయి.

కాగా మొద‌టి భార్య అనిత రెడ్డి చ‌నిపోవ‌డంతో కుమార్తె హ‌ర్షిత రెడ్డి బ‌ల‌వంతం మేర‌కు దిల్ రాజు మ‌రో పెళ్లి చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇటీవ‌లే పండంటి మగ బిడ్డ‌ను పొందారు. హాస్పిట‌ల్‌లో ఆయ‌న త‌న కొడుకుని ఎత్తుకుని మురిసిపోతున్న ఫొటోలు కూడా వైర‌ల్ అయ్యాయి. అయితే త్వ‌ర‌లోనే త‌న కొడుక్కి పేరు పెట్టే ఫంక్ష‌న్ నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఆయ‌న త‌న కొడుక్కి ఓ పేరును కూడా ఎంపిక చేశార‌ని స‌మాచారం.

Dil Raju Son Name do you know what it is
Dil Raju Son Name

త‌న మొద‌టి భార్య అనిత రెడ్డి పేరులోని మొద‌టి రెండు అక్ష‌రాలు An, రెండో భార్య వైగా రెడ్డి పేరులోని మొద‌టి రెండు అక్ష‌రాలు vy క‌లిపి Anvy Reddy అని త‌న కొడుక్కి దిల్ రాజు పేరు పెట్ట‌బోతున్నార‌ట‌. ఈ విష‌యం ప్ర‌స్తుతం ఫిలిం న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ పేరు త‌న భార్య వైగా రెడ్డికి చెప్ప‌గా ఆమె అందుకు ఓకే చెప్పిదంట‌. దీంతో అన్వి రెడ్డి అనే పేరునే త‌న కొడుక్కి పెట్ట‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే రెడ్డి అనే కులం ట్యాగ్‌ను ప్ర‌ద‌ర్శించుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని దిల్ రాజు కొడుక్కి మాత్రం అదే విధంగా పేరు పెడుతుండడం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now