OTT : ఈ వారం ఓటీటీల్లో వ‌స్తున్న సిరీస్‌లు, సినిమాలు ఇవే..!

July 11, 2022 11:47 AM

OTT : వారం వారం కొత్త సినిమాలు, సిరీస్ లు ఓటీటీల్లో సంద‌డి చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే వారం మారాక ఈ వారం ఏయే మూవీలు రిలీజ్ అవుతున్నాయి.. అని తెలుసుకోవ‌డం కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్ర‌స్తుత త‌రుణంలో ఓటీటీల పుణ్య‌మా అని థియేట‌ర్ల‌లో వ‌చ్చిన సినిమాల‌ను నెల రోజులు తిర‌క్కుండానే ఓటీటీల్లో వీక్షిస్తున్నారు. దీంతో ఓటీటీ సంస్థ‌లు కూడా కొత్త మూవీల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నాయి. ఇక ఓటీటీల్లో ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌ల వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, చాందిని చౌద‌రి న‌టించిన స‌మ్మ‌త‌మే మూవీ ఈ వార‌మే ఓటీటీలోకి రానుంది. ఆహా ప్లాట్‌ఫామ్‌పై ఈ నెల 15వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేయ‌నున్నారు. అలాగే కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన వాశి అనే మ‌ళ‌యాళం మూవీ కూడా ఈ వారంలోనే ఓటీటీలోకి రానుంది. ఈ మూవీని ఈ నెల 17వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయ‌నున్నారు.

movies and series streaming on OTT apps on July 15th 2022
OTT

ఇక విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన మామ‌ణిథ‌న్ అనే త‌మిళ మూవీని ఆహా త‌మిళ యాప్‌లో ఈ నెల 15వ తేదీన రిలీజ్ చేయ‌నున్నారు. మా నీళ్ల ట్యాంక్ అనే కామెడీ డ్రామా సిరీస్‌లో సుశాంత్‌, ప్రియా ఆనంద్ న‌టించ‌గా.. ఈ సిరీస్ జీ5 యాప్‌లో ఈ నెల 15వ తేదీన రిలీజ్ కానుంది.

పంచాయ‌త్ ఫేమ్ జితేంద్ర కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన జాదుగ‌ర్ అనే సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ చేయ‌నున్నారు. ఈ సిరీస్ ఈ నెల 15న రిలీజ్ కానుంది. ఇది హిందీలో అందుబాటులో ఉంటుంది. ఇలా ప‌లు మూవీలు, సిరీస్‌లు ప్రేక్ష‌కుల‌ను ఈ వారం అల‌రించ‌నున్నాయి.

ott

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment