Pavitra Lokesh : న‌రేష్‌, ప‌విత్ర లోకేష్‌.. ఓహో.. వీరి బంధం అప్ప‌టి నుంచే ఉంద‌న్న‌మాట‌..!

July 9, 2022 3:14 PM

Pavitra Lokesh : గ‌త కొద్ది రోజులుగా న‌రేష్, ప‌విత్ర లోకేష్‌ల‌కు చెందిన వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్న విష‌యం విదిత‌మే. న‌రేష్, ప‌విత్ర ఇద్ద‌రూ మైసూర్‌లోని ఓ హోట‌ల్‌లో న‌రేష్ భార్య ర‌మ్య ర‌ఘుప‌తికి ప‌ట్టుబ‌డ్డారు. దీంతో వీరి వ్య‌వ‌హారం మొత్తం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అప్ప‌టి వ‌ర‌కు గుట్టుగా ఉన్న వీరి సంబంధాన్ని వీరే బ‌య‌ట‌కు చెప్పి అంగీక‌రించాల్సి వ‌చ్చింది. దీంతో వీరు త‌మ ప‌రువు మొత్తం పోగొట్టుకున్న‌ట్లు అయింది.

ఇక న‌రేష్ భార్య ర‌మ్య ర‌ఘుప‌తి మాట్లాడుతూ.. త‌న‌ను న‌రేష్ గ‌న్‌తో బెదిరిస్తూ విడాకులు కావాల‌ని అంటున్నాడ‌ని.. త‌న‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాటం చేస్తాన‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే న‌రేష్ మాట్లాడుతూ.. త‌న భార్య‌కు ఎంతో మందితో అక్ర‌మ సంబంధాలు ఉన్నాయ‌ని తెలిపారు. ప‌విత్ర లోకేష్ అయితే ఏకంగా.. న‌రేష్‌కు, త‌న‌కు ఉన్న సంబంధం గురించి కృష్ణ ఫ్యామిలీ అంద‌రికీ తెలుస‌ని.. త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకుంటాం అని స్ప‌ష్టం చేసింది. దీంతో వీరిపై రోజుకో వార్త వ‌స్తోంది.

Pavitra Lokesh and Naresh Sammohanam movie video viral
Pavitra Lokesh

అయితే న‌రేష్‌, ప‌విత్ర లోకేష్‌లు క‌ల‌సి ఎన్నో సినిమాల్లో న‌టించారు. కానీ వీరి మ‌ధ్య ఉన్న బంధం బ‌య‌ట‌ప‌డ్డాకే అస‌లు విష‌యం తెలిసింది. న‌రేష్ తాను న‌టించే సినిమాల్లో ప‌విత్ర‌కు కావాల‌నే ఒక క్యారెక్ట‌ర్ ఇప్పించే వార‌ని ఇప్పుడు అర్థ‌మ‌వుతోంది. ఇక వీరి మ‌ధ్య నాలుగేళ్ల కింద‌టి నుంచే బంధం ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అందుకు బ‌లం చేకూర్చేలా ఓ మూవీలో ఓ సీన్ కూడా ఉంది. అందులో వీరి రొమాన్స్ చూస్తే అప్ప‌టి నుంచే వీరు స‌హ‌జీవ‌నం చేస్తున్నారా.. అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు.

అప్ప‌ట్లో సుధీర్ బాబు, అదితి రావు హైద‌రి చేసిన సినిమా స‌మ్మోహ‌నం. ఈ మూవీ 2018 జూన్ 15వ తేదీన రిలీజ్ అయి బాక్సాఫీస్ వ‌ద్ద పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ఇందులో న‌రేష్, ప‌విత్ర లోకేష్‌లు కూడా న‌టించారు. ఓ సీన్‌లో వీరిద్ద‌రి మ‌ధ్య రొమాన్స్ ఒక రేంజ్‌లో ఉంటుంది. అందులో ఇంటికి వ‌చ్చిన హీరోయిన్‌కు హీరో ఇల్లు చూపించేందుకు తీసుకెళ్తాడు. అక్క‌డే ఉన్న ప‌విత్ర లోకేష్ న‌రేష్‌తో.. రొమాంటిక్‌గా మాట్లాడుతుంది. అయితే తాజాగా వీరి విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో అప్ప‌టి ఆ సినిమాలోని సీన్‌ను మ‌ళ్లీ వైర‌ల్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆ సినిమా నుంచే.. అంటే.. 4 ఏళ్ల నుంచే న‌రేష్, ప‌విత్ర‌ల మ‌ధ్య వ్య‌వ‌హారం న‌డుస్తుంద‌ని అంటున్నారు. ఇక ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న‌ది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now