Ram Charan : రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ ఏయే భాగాల‌కు ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకున్నారో తెలుసా ?

July 8, 2022 10:39 PM

Ram Charan : మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన హీరోల్లో విజ‌యాల బాట ప‌ట్టింది ముగ్గురే. వారు మెగాస్టార్ త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర‌వింద్ త‌న‌యుడు అల్లు అర్జున్, మెగా బ్ర‌ద‌ర్ కుమారుడు వ‌రుణ్ తేజ్. మిగిలిన వారు కూడా సినిమాల్లో ఫ‌ర్వాలేదనిపించారు. సాయి ధ‌ర‌మ్ తేజ్‌, వైష్ణవ్ తేజ్‌లు కూడా త‌మ సత్తా ఏంటో చాటారు. కానీ రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌ల‌కు వ‌చ్చినంత పేరు, క్రేజ్‌.. మిగిలిన మెగా హీరోల‌కు రాలేద‌నే చెప్పాలి. వీరిద్ద‌రూ మెగా ఫ్యామిలీలో ప్ర‌స్తుతం టాప్ హీరోలుగా కొన‌సాగుతున్నారు.

అయితే అల్లు అర్జున్ చేసిన గంగోత్రి సినిమాకు.. ఆ త‌రువాత సినిమాల‌కు ఆయ‌న ముఖంలో చాలా మార్పుల‌ను మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ముఖ్యంగా ఆయ‌న ముక్కు, పెదాలు పూర్తిగా మారిపోయాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆ భాగాల‌కు స‌ర్జ‌రీ చేయించుకున్న‌ట్లు స‌మాచారం. అలాగే చ‌ర‌ణ్ కూడా ముక్కు, పెద‌వుల‌కు స‌ర్జ‌రీ చేయించుకున్న‌ట్లు గ‌మ‌నించ‌వ‌చ్చు. కానీ చ‌ర‌ణ్ సినిమాల్లోకి రాకముందే స‌ర్జ‌రీ చేయించుకోగా.. అల్లు అర్జున్ మాత్రం వచ్చాక స‌ర్జ‌రీ చేయించుకున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆ విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే వారు గొప్ప న‌టులుగా మారార‌ని చెప్ప‌వ‌చ్చు. త‌మ న‌ట‌న‌, డ్యాన్స్‌ల‌తో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. క‌నుక వారి శ‌రీరాకృతి ఎలా ఉన్నా.. ఫ్యాన్స్ మాత్రం వారి న‌ట‌న‌, డ్యాన్స్‌ల‌కే ప్రాధాన్య‌త ఇచ్చార‌ని చెప్ప‌వ‌చ్చు.

Ram Charan and Allu Arjun observe their faces and noses
Ram Charan

ఇక హీరోయిన్లు కూడా చాలా మంది ప్లాస్టిక్ స‌ర్జ‌రీలు చేయించుకున్న‌వారే. బాలీవుడ్‌లో జాన్వీ క‌పూర్‌, ఆమె త‌ల్లి శ్రీ‌దేవి, ట‌బు, శ్ర‌ద్ధా క‌పూర్‌ల‌తోపాటు తెలుగులో స‌మంత‌, శృతి హాస‌న్‌.. ఇలా చాలా మంది స‌ర్జ‌రీలు చేయించుకున్నారు. ఆ త‌రువాతే వారు సినిమాల్లో పాపుల‌ర్ అయ్యారు. స‌ర్జ‌రీలు చేయించుకోవ‌డం అన్న‌ది ఇప్పుడు చాలా కామ‌న్ విష‌యం అయిపోయింది. ఒక‌ప్పుడు కేవ‌లం సెల‌బ్రిటీలు మాత్ర‌మే ఈ విధంగా చేసేవారు. కానీ ఇప్పుడు టెక్నాల‌జీ వాడ‌కం ఎక్కువ కావ‌డంతో త‌క్కువ ధ‌ర‌ల‌కే ప్లాస్టిక్ స‌ర్జ‌రీలు అందుబాటులో ఉన్నాయి. దీంతో చాలా మంది త‌మ శ‌రీర భాగాల‌ను ప్లాస్టిక్ సర్జ‌రీల‌తో స‌రి చేసుకుంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now