Dil Raju With Son : కొడుకును చూసి దిల్ రాజు ప‌ట్ట‌లేనంత ఆనందం.. ఫొటో వైర‌ల్‌..!

July 4, 2022 9:58 AM

Dil Raju With Son : టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్ రాజు ఇటీవలే మ‌ళ్లీ తండ్రి అయిన విష‌యం తెలిసిందే. ఆయ‌న రెండో భార్య తేజ‌స్విని అలియాస్ వైఘా రెడ్డి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. ఈ క్ర‌మంలోనే ఈ వార్త సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయింది. దిల్ రాజు మొద‌టి భార్య అనితా రెడ్డి కాగా ఆమె 2017లో గుండె పోటుతో మ‌ర‌ణించారు. ఆమెకు ఒక కుమార్తె ఉంది. పేరు హ‌న్షిత రెడ్డి. ఈమెకు పిల్ల‌లు కూడా ఉన్నారు. ఇక తేజ‌స్వినిని దిల్ రాజు కరోనా స‌మ‌యంలో వివాహం చేసుకున్నారు. డిసెంబ‌ర్‌ 10, 2020వ తేదీన దిల్ రాజు, తేజ‌స్వినిల వివాహం జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే ఆమెకు ఇటీవ‌ల మ‌గ‌బిడ్డ జ‌న్మించాడు.

అయితే ఆల్రెడీ తాత అయిన దిల్ రాజు తండ్రి అయ్యారు.. అంటూ ఆయ‌న‌ను కొంద‌రు ప్ర‌శంసించ‌గా.. కొంద‌రు మాత్రం తాత వ‌య‌స్సులో తండ్రి అవ‌డం ఏంటి ? అని కామెంట్స్ చేశారు. అయితే ఎవ‌రేమ‌న్నా.. ప్ర‌స్తుతం దిల్ రాజు మాత్రం పుత్రోత్సాహంతో కనిపిస్తున్నారు. ఆయ‌న హాస్పిట‌ల్‌లో త‌న కుమారున్ని చేతుల్తో ఎత్తుకుని మురిసిపోయారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న కొడుకుని ఎత్తుకుని ఉద్వేగ‌భ‌రిత‌మైన క్ష‌ణాల‌ను అనుభ‌విస్తుండ‌గా.. ఫొటోను తీశారు. ఆ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Dil Raju With Son his latest photo viral netizen comments
Dil Raju With Son

కాగా దిల్ రాజు ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌ను నిర్మిస్తున్నారు. ఆయ‌న నిర్మాణ బాధ్య‌త‌ల‌ను కుమార్తె హ‌న్షిత కూడా చూసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే దిల్ రాజు త‌మిళ స్టార్ న‌టుడు విజ‌య్‌తో క‌లిసి వార‌సుడు అనే మూవీని నిర్మిస్తుండ‌గా.. భారీ బ‌డ్జెట్‌తో శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ఇంకో మూవీని సైతం నిర్మిస్తున్నారు. ఇక వీటితోపాటు త్వ‌ర‌లోనే ఇంకొన్ని సినిమాల‌ను కూడా ఆయ‌న నిర్మించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment