Sri Reddy On Naresh : క‌ల్యాణాల ప‌వ‌న్‌.. న‌రేష్ వేస్ట్ ఫెలో.. ప‌విత్ర లోకేష్‌కు సిగ్గులేదు.. శ్రీ‌రెడ్డి గ‌రం గ‌రం..!

July 3, 2022 3:05 PM

Sri Reddy On Naresh : సీనియ‌ర్ న‌టుడు న‌రేష్, న‌టి ప‌విత్ర లోకేష్ ల వ్య‌వ‌హారం మ‌ళ్లీ ఒక కొత్త మ‌లుపు తీసుకుంది. మైసూర్‌లో వారు బ‌స చేసిన హోట‌ల్‌కు న‌రేష్ భార్య ర‌మ్య ర‌ఘుప‌తి చేరుకుని వారిని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. అయితే ప‌విత్ర‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేసిన ర‌మ్య ఆమెను చెప్పుతో కొట్టేందుకు య‌త్నించ‌గా.. అక్క‌డే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. త‌రువాత ఇరు ప‌క్షాల‌ను వేర్వేరుగా బ‌య‌ట‌కు పంపించారు. ఈ క్ర‌మంలోనే ఈ వార్త సంచ‌ల‌నం సృష్టిస్తోంది. అయితే తాజాగా న‌టి శ్రీ‌రెడ్డి ఈ విష‌యంపై స్పందించింది. ఆమె న‌రేష్‌తోపాటు ప‌లువురిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఘాటు వ్యాఖ్య‌లు చేసింది.

న‌రేష్ ఒక వేస్ట్ ఫెలో అని శ్రీ‌రెడ్డి పేర్కొంది. అత‌ను త‌న‌ను మా అసోసియేష‌న్ నుంచి బ్యాన్ చేశాడ‌ని.. త‌న వ‌ల్ల అసోసియేష‌న్ అప‌విత్రంగా మారింద‌ని.. అందువ‌ల్ల యాసిడ్‌తో క‌డ‌గాల‌ని అప్ప‌ట్లో అన్నాడ‌ని.. అయితే క‌ర్మ ఫ‌లితం అనేది ఒక‌టి ఉంటుందని.. కాస్త ఆల‌స్యం అయినా స‌రే.. క‌ర్మ త‌ప్ప‌క చూపిస్తుంద‌ని.. శ్రీ‌రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. ఇక ప‌విత్ర లోకేష్ అప్ప‌ట్లో త‌నకు స‌పోర్ట్ చేయ‌లేద‌ని.. తాను కాస్టింగ్ కౌచ్ ఉద్య‌మంపై పోరాడుతుంటే త‌న‌పై లేని పోని ఆరోప‌ణ‌లు చేసింద‌ని.. అయితే ఇప్పుడు స‌మ‌స్య ఆమెకు వ‌చ్చింద‌ని.. మ‌రి ఇప్పుడు ఆమెకు ఎవ‌రు మ‌ద్ద‌తు ప‌లుకుతారు.. అంటూ శ్రీ‌రెడ్డి ప్ర‌శ్నించింది.

Sri Reddy On Naresh she responded over his latest issues
Sri Reddy On Naresh

ఇక న‌రేష్‌, ప‌విత్రా లోకేష్‌ల‌పై వ్యాఖ్య‌లు చేస్తూనే మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను కూడా ఆమె దూషించింది. క‌ల్యాణాల ప‌వ‌న్ అంటూ కామెంట్స్ చేసింది. త‌నను ఇబ్బందుల‌కు గురిచేసిన వాళ్ల సినిమాలు ఇప్పుడు అట్ట‌ర్ ఫ్లాప్ అవుతున్నాయ‌ని శ్రీ‌రెడ్డి కామెంట్స్ చేసింది. ఈ క్ర‌మంలోనే ఆమె త‌న సోష‌ల్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment