Pavithra Lokesh : స్టింగ్ ఆప‌రేష‌న్‌లో అడ్డంగా దొరికిపోయిన ప‌విత్ర లోకేష్‌.. న‌రేష్‌తో సంబంధం నిజ‌మే..

June 30, 2022 10:06 PM

Pavithra Lokesh : న‌టి ప‌విత్రా లోకేష్‌, సీనియ‌ర్ న‌టుడు న‌రేష్‌ల మ‌ధ్య ఏదో సంబంధం ఉంద‌ని గ‌త కొంత కాలంగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం విదిత‌మే. వీరిద్ద‌రూ పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే పెళ్లి అనేది ఫూల్స్ చేసే ప‌ని అని.. త‌న‌కు వివాహ వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం పోయింద‌ని న‌రేష్ అన్నారు. కానీ ప‌విత్ర లోకేష్‌తో ఉన్న రిలేష‌న్ షిప్‌పై ఆయ‌న క్లారిటీ ఇవ్వ‌లేదు. వీరు ఎక్క‌డికి వెళ్లినా క‌లిసే వెళ్తుండ‌డం, మ‌హాబ‌లేశ్వ‌రం టెంపుల్‌లో క‌ల‌సి పూజ‌లు చేయ‌డం.. వంటి సంఘ‌ట‌న‌ల వ‌ల్ల వీరు స‌హ‌జీవ‌నం చేస్తున్నార‌ని అనుకున్నారు. అయితే ఈ విష‌యాల‌న్నింటినీ ప‌విత్రా లోకేష్ బ‌య‌ట పెట్టారు. ఓ టీవీ చాన‌ల్ నిర్వ‌హించిన స్టింగ్ ఆప‌రేష‌న్‌లో ఆమె అడ్డంగా దొరికిపోయారు.

క‌ర్ణాట‌క‌కు చెందిన ఓ క‌న్న‌డ న్యూస్ చాన‌ల్ స్టింగ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించింది. ఆ చాన‌ల్‌కు చెందిన ఓ ప్ర‌తినిధి త‌న‌ను తాను ఓ క‌న్స‌ల్టెంట్‌గా చెప్పుకుని స్టింగ్ ఆప‌రేష‌న్ చేశాడు. ఈ క్ర‌మంలోనే ఆ ప్ర‌తినిధి ఆమెను ప‌లు ప్ర‌శ్న‌లు అడిగాడు. న‌రేష్‌తో ఉన్న సంబంధం గురించి కూడా ఆమెను ప్ర‌శ్న‌లు అడిగాడు. అయితే త‌మ మ‌ధ్య రిలేష‌న్ షిప్ ఉన్న మాట నిజ‌మేన‌ని ఆమె అంగీక‌రించింది. అయితే అది త‌న వ్య‌క్తిగ‌త విష‌య‌మ‌ని.. దానిపై ప్ర‌శ్నించేందుకు ఎవ‌రికీ అధికారం లేద‌ని తెలిపింది.

Pavithra Lokesh agreed about news with Naresh
Pavithra Lokesh

ఇక తాను, న‌రేష్ క‌ల‌సి ఉంటున్న‌ట్లు సూప‌ర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి తెలుస‌ని.. వారికే అభ్యంత‌రం లేన‌ప్పుడు మిగిలిన వారికి అభ్యంత‌రాలు ఎందుక‌ని ఆమె ప్ర‌శ్నించింది. ఈ క్ర‌మంలోనే ఆమె స్టింగ్ ఆప‌రేష‌న్ తాలూకు వీడియో దుమారం రేపుతోంది. సోష‌ల్ మీడియాలో ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. న‌రేష్ మూడో భార్య ర‌మ్య ర‌ఘుప‌తి కేసు విష‌యంలో ఆ చాన‌ల్ వారు నిజానిజాలు తెలుసుకునేందుకు ఈ స్టింగ్ ఆప‌రేష‌న్ చేసిన‌ట్లు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ సంఘ‌ట‌న వ‌ల్ల వీరి క‌థ ఊహించ‌ని మ‌లుపు తిరిగింద‌ని చెప్ప‌వ‌చ్చు. దీనిపై న‌రేష్ లేదా ప‌విత్ర లోకేష్ మ‌ళ్లీ క్లారిటీ ఇస్తారో.. లేదో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now