Pavitra Lokesh : న‌రేష్‌, ప‌విత్ర లోకేష్‌.. స‌హ‌జీవ‌న‌మే..? పెళ్లి డౌటే..?

June 30, 2022 1:36 PM

Pavitra Lokesh : టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు న‌రేష్‌, సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు ప‌విత్ర లోకేష్‌లు పెళ్లి చేసుకున్నార‌ని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం విదిత‌మే. న‌రేష్ న‌టిస్తున్న అన్ని సినిమాల్లోనూ ఆమె కూడా యాక్ట్ చేస్తుండ‌డం, ఇద్ద‌రూ ఎక్క‌డికి వెళ్లినా క‌లిసే వెళ్తుండ‌డంతోపాటు మ‌హాబ‌లేశ్వ‌రంలో క‌ల‌సి పూజ‌లు చేయించ‌డం.. వంటివ‌న్నీ వీరి వివాహ వార్త‌ల‌కు బ‌లం చేకూర్చాయి. అయితే న‌రేష్ మాత్రం ఆమెతో పెళ్లి కాలేద‌ని అన్నారు. ఇప్ప‌టికే మూడు పెళ్లళ్లు చేసుకున్న త‌న‌కు అస‌లు వివాహం అంటేనే బోర్ కొట్టింద‌ని.. వివాహ వ్య‌వ‌స్థ‌పై అసంతృప్తి క‌లుగుతుంద‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. అయితే ఆయ‌న ఇలా వ్యాఖ్య‌లు చేసిన‌ప్ప‌టికీ ప‌విత్ర లోకేష్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని ఉంటార‌నే అనుకుంటున్నారు.

ఇక పెళ్లి వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం పోయింద‌న్న న‌రేష్ మాట‌ల‌కు కొంద‌రు వేరే అర్థాలు తీస్తున్నారు. ఆయ‌న ప‌విత్ర లోకేష్‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్నార‌ని.. అందుక‌నే పెళ్లిపై అలాంటి కామెంట్స్ చేశార‌ని అంటున్నారు. క‌నుక ఆయ‌న పెళ్లి చేసుకోర‌ని.. ఆ విష‌యం డౌట్‌గానే ఉంద‌ని.. అయితే స‌హ‌జీవ‌నం మాత్ర‌మే చేస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి ఇందులో నిజం ఎంత ఉంది అనే విష‌యాలు తెలియాల్సి ఉంది. అయితే న‌రేష్ ఇప్ప‌టికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ఇంకో పెళ్లి అంటే బోర్ కొట్టి ఉండ‌వ‌చ్చు. క‌నుక‌నే ప‌విత్ర లోకేష్‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్నార‌నే వార్త‌ల‌కు బ‌లం చేకూరిన‌ట్లు కూడా అవుతోంది.

latest news update on Pavitra Lokesh and Naresh
Pavitra Lokesh

ఇక వీరిద్ద‌రూ క‌ల‌సి సుమారుగా 10కి పైగానే చిత్రాల్లో న‌టించారు. షూటింగ్ స‌మ‌యంలోనే న‌రేష్ వ్య‌క్తిత్వం న‌చ్చి ఆమె ఇష్ట ప‌డింద‌ని.. ఇది వారిద్దిరి మ‌ధ్య ప్రేమను క‌లిగేలా చేసింద‌ని అంటున్నారు. ఇక ప‌విత్ర లోకేష్‌కు కూడా రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొద‌టి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను వివాహం చేసుకున్న ఈమె త‌రువాత టీవీ యాక్ట‌ర్ సుచేంద్ర ప్ర‌సాద్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. అయితే ఆయ‌న‌తో వ‌చ్చిన మ‌న‌స్ఫ‌ర్థ‌ల కార‌ణంగానే ఆమె భ‌ర్త‌కు దూరంగా ఉంటుంద‌ని.. కానీ విడాకులు మాత్రం ఇంకా తీసుకోలేద‌ని అంటున్నారు. మ‌రి భ‌విష్య‌త్తులో అయినా న‌రేష్, ప‌విత్ర‌లు పెళ్లి చేసుకుంటారా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now