Tabu : 50 ఏళ్ల వ‌య‌స్సులోనూ జోరు త‌గ్గ‌ని ట‌బు.. భారీగా రెమ్యున‌రేష‌న్ డిమాండ్‌..?

June 28, 2022 12:07 PM

Tabu : తెలుగు ప్రేక్ష‌కుల‌కు ట‌బు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అప్ప‌ట్లో ఈమె తెలుగులో చాలా పాపుల‌ర్ హీరోయిన్‌గా ఉండేది. ఈమెతో సినిమాలు చేసేందుకు హీరోలు, ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆస‌క్తిని చూపించేవారు. అక్కినేని నాగార్జున ట‌బుతో అధికంగా సినిమాలు చేశారు. అయితే ఇప్ప‌టికీ ఈమెకు పెళ్లి కాలేదు. వ‌య‌స్సేమో 50 ఏళ్లు. అయిన‌ప్ప‌టికీ ఈమె జోరు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. వ‌రుస సినిమాల్లో న‌టిస్తూ అల‌రిస్తోంది. అంతేకాదు.. ఈ మ‌ధ్య‌కాలంలో ఈమె న‌టించిన అనేక సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో ట‌బును త‌మ సినిమాల్లో న‌టింప‌జేసేందుకు మేక‌ర్స్ ఆమెకు భారీగానే ముట్ట‌జెబుతున్నార‌ట‌. ఆమె అడిగినంత ఇస్తున్నార‌ట‌.

ట‌బు ఈమ‌ధ్యే న‌టించిన భూల్ భుల‌య్యా 2 బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఇందులో ఆమె ద్విపాత్రాభిన‌యం చేసింది. అయితే హీరో కార్తీక్ ఆర్య‌న్ అయిన‌ప్ప‌టికీ అత‌ని పాత్ర‌కు పెద్ద‌గా విలువ లేదు. సినిమా మొత్తం మ‌న‌కు ట‌బునే క‌నిపిస్తుంది. అందువ‌ల్ల ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా అని చెప్ప‌వ‌చ్చు. ఇక త‌న సినిమాలు వ‌రుస హిట్స్ అవుతుండ‌డంతో ట‌బు త‌న రెమ్యున‌రేష‌న్‌ను కూడా అమాంతం పెంచేసింద‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె సినిమాకు రూ.3 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేస్తుండ‌గా.. ఇప్పుడు రూ.4 కోట్లు కావాల‌ని అడుగుతుంద‌ట‌. అయిన‌ప్ప‌టికీ ఆమెకు అడిగినంత ఇచ్చి ఆమెతో సినిమాలు తీసేందుకు నిర్మాత‌లు ముందుకు వ‌స్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే 50 ఏళ్ల వ‌య‌స్సులోనూ ట‌బు జోరు ఏమాత్రం త‌గ్గ‌డం లేద‌నే చెప్పాలి.

Tabu increased her remuneration veru much
Tabu

కాగా ట‌బు 2 ఏళ్ల కింద‌ట అల వైకుంఠ‌పుర‌ములో మూవీలో న‌టించింది. అల్లు అర్జున్‌కు త‌ల్లిగా చేసిన ఈమె అప్ప‌ట్లోనే 15 నిమిషాల త‌న రోల్‌కు గాను రూ.3 కోట్లు తీసుకుంద‌ని స‌మాచారం. ఆ త‌రువాత ఈమె తెలుగులో ఏ చిత్రంలోనూ న‌టించ‌లేదు. అయితే కెరీర్ దాదాపుగా ముగింపు ద‌శ‌లో ఉన్న ట‌బుకు ఇలా భారీ రెమ్యున‌రేష‌న్‌తో ఆఫ‌ర్లు వ‌స్తుండ‌డం నిజంగానే షాక్‌ను క‌లిగిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌రి ఈమె గ్రాఫ్ ఇకపై ఏవిధంగా ముందుకు సాగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment