Tollywood Heroes : మ‌న తెలుగు హీరోలు 31 మంది ఎవ‌రెవ‌రు ఎంత ఎత్తు ఉంటారో తెలుసా ? వారి హైట్ ఎంత అంటే..?

June 27, 2022 1:12 PM

Tollywood Heroes : సినిమా ఇండ‌స్ట్రీలో హీరోగా ఎవ‌రైనా రాణించాలంటే అందుకు అనేక అంశాలు దోహ‌ద‌ప‌డ‌తాయి. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌, డ‌బ్బు ఎంత ఉన్నా స‌రే ల‌క్ ఉండాలి. అలాగే తీసిన సినిమాలు హిట్ అవ్వాలి. దీంతోపాటు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాల‌నే త‌ప‌న ఉండాలి. ఇవ‌న్నీ ఉంటే ఎవ‌రు అయినా స‌రే హీరోగా రాణిస్తారు. అయితే అభిమానులు హీరోల‌కు చెందిన ఎత్తు, బ‌రువు, న‌లుపు, తెలుపు వంటి అంశాల‌ను ప‌ట్టించుకోరు. వారికి కావ‌ల్సింద‌ల్లా హీరోల యాక్ష‌న్ మాత్ర‌మే. కానీ మ‌న తెలుగు హీరోల‌కు చెందిన ఎత్తులు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. వారి హైట్ ఎంత ఉంటుంది ? అన్న వివ‌రాల‌ను ఒక్క‌సారి ప‌రిశీలిస్తే..

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమారుడు వ‌రుణ్ తేజ్ ఎత్తు 6 అడుగుల 4 అంగుళాలు కాగా దగ్గుబాటి రానా ఎత్తు 6 అడుగుల 3 అంగుళాలు. ఇక ప్ర‌భాస్, అల్ల‌రి న‌రేష్ ఇద్ద‌రూ 6 అడుగుల రెండున్న‌ర అంగుళాల ఎత్తు ఉన్నారు. అలాగే మ‌హేష్ బాబు, మంచు విష్ణు, సుమంత్‌లు 6 అడుగుల 2 అంగుళాల ఎత్తు ఉన్నారు.

do you know the height of our Tollywood Heroes
Tollywood Heroes

ఇక గోపీచంద్‌, బెల్లంకొండ శ్రీ‌నివాస్, వెంక‌టేష్‌లు 6 అడుగుల 1 అంగుళం ఎత్తు వ‌ర‌కు ఉన్నారు. ర‌వితేజ, నాగార్జున‌ 6 అడుగులు ఉన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్, మంచు మ‌నోజ్ 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు ఉన్నారు. వ‌రుణ్ సందేశ్, అఖిల్‌, నితిన్, శ్రీ‌కాంత్ లు 5 అడుగుల 10 అంగుళాల ఎత్తు ఉన్నారు. చిరంజీవి, బాల‌కృష్ణ‌, అల్లు అర్జున్, శ‌ర్వానంద్‌, నిఖిల్‌, నాగ‌శౌర్యలు 5 అడుగుల 9 అంగుళాలు ఉండ‌గా.. రామ్ చ‌ర‌ణ్ 5 అడుగుల ఎనిమిదిన్న‌ర అంగుళాల ఎత్తు ఉన్నారు. కల్యాణ్ రామ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్, నాని, నాగ‌చైత‌న్య‌లు 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు ఉన్నారు. రామ్, ఎన్టీఆర్‌లు 5 అడుగుల 7 అంగుళాల ఎత్తు ఉన్నారు.

గ‌మ‌నిక‌: ఈ స‌మాచారం మాకు ఇంట‌ర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇవ్వ‌బ‌డింది. ఇందులో త‌ప్పుల‌కు మాది బాధ్య‌త కాదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment