Allu Arjun : అల్లు అర్జున్ కొత్త లుక్‌పై దారుణ‌మైన కామెంట్లు.. పుష్ప 2 కోస‌మేనా..?

June 26, 2022 7:37 PM

Allu Arjun : అల్లు అర్జున్ న‌టించిన పుష్ప చిత్రం ఆయ‌న‌కు ఎంత‌టి పేరును తెచ్చి పెట్టిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ సినిమాతో బ‌న్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ క్ర‌మంలోనే పుష్ప ఇచ్చిన జోష్‌తో ఆ మూవీకి గాను రెండో పార్ట్‌ను చిత్రీక‌రించే ప‌నిలో ప‌డ్డారు. అయితే ద‌ర్శ‌కుడు సుకుమార్ ఇప్ప‌టికే పుష్ప 2 క‌థ‌ను సిద్ధం చేశార‌ని స‌మాచారం. కానీ కేజీఎఫ్ 2 ఫీవ‌ర్ కార‌ణంగా క‌థ‌కు ఇంకా మార్పులు చేయాల‌ని చూస్తున్నార‌ట‌. కేజీఎఫ్ 2ను మించి యాక్ష‌న్‌, డ్రామా ఉండాల‌నే ఉద్దేశంతో సుకుమార్ ఆ దిశ‌గా క‌థ‌ను మార్చుతున్నార‌ట‌. అందుక‌నే పుష్ప 2 షూటింగ్ ఆల‌స్యం అవుతుంద‌ని తెలుస్తోంది.

ఇక పుష్ప మొద‌టి పార్ట్‌లో అల్లు అర్జున్ త‌గ్గేదేలే డైలాగ్ కూడా విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఈ డైలాగ్‌ను సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు చాలా మంది ఇప్ప‌టికీ అనుక‌రిస్తున్నారు. అయితే పుష్ప 2కు గాను ఇంకో భిన్న‌మైన మ్యాన‌రిజంను ప‌రిచ‌యం చేయాల‌ని చూస్తున్నార‌ట‌. అలాగైతేనే సినిమా ప్రేక్ష‌కుల్లోకి బాగా వెళ్తుంది. త‌గ్గేదేలే డైలాగ్‌ను.. మ్యాన‌రిజాన్ని మ‌ళ్లీ రెండో పార్ట్‌లోనూ ఉంచితే పెద్ద తేడా ఏమీ ఉండ‌దు. కొత్త‌ద‌నం ఉండ‌దు. క‌నుక భిన్న‌మైన డైలాగ్‌తో కూడిన మ్యాన‌రిజాన్ని పుష్ప 2లో చూపించ‌నున్నార‌ట‌. ఇందుకు గాను బ‌న్నీ చిత్తూరు జిల్లా యాస‌పై మ‌రింత ప్రాక్టీస్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక పుష్ప 2 లో బ‌న్నీ మేకోవ‌ర్‌ను కూడా కాస్త మార్చ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కొత్త లుక్‌తో కూడిన ఫొటోలు తాజాగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

netizen negative comments on Allu Arjun new look
Allu Arjun

అల్లు అర్జున్ కొత్త లుక్‌తో తాజాగా ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఇందులో ఇంకాస్త జుట్టు పెంచి కొద్దిగా లావు అయిన‌ట్లు క‌నిపిస్తున్నాడు. ఇది పుష్ప 2 కోసం ట్రై చేస్తున్న కొత్త లుక్కేన‌ని అంటున్నారు. అయితే ఈ ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతుండ‌గా.. వీటిపై నెటిజ‌న్లు భిన్న ర‌కాలుగా స్పందిస్తున్నారు. కొంద‌రు బాగుంద‌ని కామెంట్లు చేస్తుంటే.. కొంద‌రు మాత్రం నెగెటివ్ కామెంట్ల‌ను పెడుతున్నారు. ఈ లుక్‌లో నువ్వు వ‌డాపావ్‌లా ఉన్నావ్‌.. అని కొంద‌రు అంటుండ‌గా.. రోజు రోజుకీ బ‌న్నీ బుద్ధుడిలా త‌యార‌వుతున్నాడ‌ని అంటున్నారు. అలాగే ఇంకొంద‌రు శ్రీ‌లంక క్రికెట‌ర్ మ‌లింగా మాదిరిగా ఉన్నావ‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే పుష్ప 2లో అస‌లు బ‌న్నీ ఎలా కనిపించ‌బోతున్నాడు.. అనే దానిపై ఆస‌క్తి నెల‌కొంది. ఇక ఈ మూవీ షూటింగ్ ఆగ‌స్టు నెల‌లో ప్రారంభం కానున్న‌ట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment