Viral Video : అదిరిపోయే రీతిలో డ్యాన్స్ వేసిన యువ‌తి.. మ‌తులు పోతున్నాయి క‌దా.. వీడియో..!

June 26, 2022 5:19 PM

Viral Video : త‌మిళ న‌టుడు విజ‌య్‌, బుట్ట‌బొమ్మ పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా న‌టించిన బీస్ట్ మూవీ ప్రేక్ష‌కులను నిరాశ‌పరిచింది. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ‌ప‌రిచింది. ఈ మూవీ బాగా లేద‌ని సాక్షాత్తూ విజ‌య్ అభిమానులే చెన్నైలో ఏకంగా ఓ థియేట‌ర్ తెర‌ను ద‌గ్ధం చేశారు. అయితే ఈ మూవీలోని పాటలు మాత్రం బాగా హైలైట్ అయ్యాయి. అనిరుద్ ర‌విచంద‌ర్ ఈ సినిమాకు సంగీతం అందించ‌డంలో పూర్తి న్యాయం చేశాడ‌ని చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా ఈ సినిమాలోని అర‌బిక్ కుతు పాట బాగా హిట్ అయింది. దీనికి చాలా మంది సెల‌బ్రిటీలు సైతం డ్యాన్స్‌లు చేసి ఎంజాయ్ చేశారు. వారి వీడియోలు వైర‌ల్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే ఈ పాట ఇప్ప‌టికీ ట్రెండ్ అవుతూనే ఉంది. దీనికి చాలా మంది స్టెప్స్ వేస్తూనే ఉన్నారు.

తాజాగా ఓ యువ‌తి అర‌బిక్ కుతు పాట‌లో పూజా హెగ్డె వేసిన స్టెప్స్‌కు అనుగుణంగానే స్టెప్స్ వేసి అల‌రించింది. ఈ క్ర‌మంలోనే ఆమె డ్యాన్స్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇందులో పూజా హెగ్డెకు త‌గ్గట్లుగా ఆ యువ‌తి డ్యాన్స్ చేసింది. దీంతో ఆమెను నెటిజ‌న్లు కొనియాడుతున్నారు. చాలా అద్భుతంగా డ్యాన్స్ చేశావ‌ని అంటున్నారు.

Viral Video girl danced for Arabic Kuthu song
Viral Video

ఇక బీస్ట్ మూవీ ఏప్రిల్ 13వ తేదీన రిలీజ్ కాగా.. దీనికి రూ.150 కోట్ల బ‌డ్జెట్ అయింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ ఫ్లాప్ అయిన‌ప్ప‌టికీ ఎక్కువ సంఖ్య‌లో థియేట‌ర్ల‌లో రిలీజ్ చేశారు, స్టార్ హీరో క‌నుక రూ.250 కోట్ల క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. ఈ మూవీ ప్ర‌స్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment