Anasuya : బిగ్ బాస్ సీజ‌న్ 6లో అన‌సూయ‌..? రెమ్యున‌రేష‌న్ తెలిస్తే షాక‌వ్వ‌డం ఖాయం..!

June 25, 2022 5:03 PM

Anasuya : బుల్లితెర‌పై అత్యంత విజ‌య‌వంతం అయిన షోల‌లో బిగ్ బాస్ ఒక‌టి. బిగ్ బాస్ ఇప్ప‌టి వ‌ర‌కు 5 సీజ‌న్ల‌ను పూర్తి చేసుకుని 6వ సీజ‌న్ కోసం రెడీ అవుతోంది. అయితే మొన్నీ మ‌ధ్యే బిగ్ బాస్ ఓటీటీ పేరిట ఒక షోను నిర్వ‌హించారు. కానీ దీనికి పెద్ద‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. ఇక సీజ‌న్ 6 కోసం ప్ర‌స్తుతం నిర్వాహ‌కులు అంతా సిద్ధం చేస్తుండ‌గా.. త్వ‌రలోనే ఈ షో ప్రారంభం కానున్న‌ట్లు తెలుస్తోంది. సెప్టెంబ‌ర్ నుంచి ఈ షో ప్రారంభం కానుంది స‌మాచారం. ప్ర‌స్తుతం ఇంటి సెట్‌ను నిర్మిస్తుండ‌డంతోపాటు కంటెస్టెంట్ల కోసం కూడా వేట కొన‌సాగిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి షో కోసం యాంక‌ర్ అన‌సూయ‌ను నిర్వాహ‌కులు సంప్ర‌దిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఫిలింన‌గ‌ర్‌లో ఈ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది.

బుల్లితెర‌పైనే కాకుండా వెండితెర‌పై కూడా స‌త్తా చాటుతున్న వారిలో అన‌సూయ ఒక‌రు. ఈమె టీవీ షోల‌తో బిజీగా ఉంటూనే మ‌రోవైపు సినిమాలు కూడా చేస్తోంది. అయితే ఈమెను బిగ్ బాస్ సీజ‌న్ 6లో కంటెస్టెంట్‌గా తీసుకోవాల‌ని నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇందుకు గాను ఆమెకు భారీగానే పారితోషికాన్ని ముట్ట‌జెబుతామ‌ని ఆఫ‌ర్ కూడా ఇచ్చార‌ట‌. ఏకంగా రూ.1 కోటి ఇస్తామ‌ని అన్నార‌ట‌. అయితే ఇందుకు అన‌సూయ యెస్ చెప్పిందా.. నో చెప్పిందా.. అన్న వివ‌రాలు మాత్రం తెలియ‌డం లేదు.

Anasuya reportedly got Bigg Boss Telugu Season 6 offer
Anasuya

అన‌సూయ ప్ర‌స్తుతం టీవీ షోలు, సినిమాల‌తో ఎంతో బిజీగా ఉంది. క‌నుక ఈమె బిగ్ బాస్ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే షోలో అన‌సూయ పాల్గొంటే క‌నీసం 6 వారాల పాటు అయినా ఉండే చాన్స్ ఉంది. అంటే.. అన్ని రోజులు రోజుకు రూ.3 ల‌క్ష‌లు (ఆమె ఒక ఎపిసోడ్ లేదా ఈవెంట్‌కు తీసుకునేది) వేసుకుంటే.. రూ.1.26 ల‌క్ష‌లు అవుతాయి. అంటే.. ఆమెకు బిగ్ బాస్ వారు ఆఫ‌ర్ చేసేది ఇంకా త‌క్కువే అవుతుంది. కానీ రూ.1.50 కోట్ల వ‌ర‌కు ఆఫ‌ర్ చేస్తే ఆమె రావ‌చ్చు. వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. మ‌రి అన‌సూయ బిగ్ బాస్ ఆఫ‌ర్‌ను అందుకుని షోలో పాల్గొంటుందా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment