Rakul Preet Singh : త‌న ఫిట్‌నెస్‌, డైట్ సీక్రెట్స్ ఏంటో చెప్పేసిన ర‌కుల్ ప్రీత్ సింగ్‌..!

June 19, 2022 12:42 PM

Rakul Preet Singh : ర‌కుల్ ప్రీత్ సింగ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టి దాదాపుగా 13 ఏళ్ల‌కు పైగానే అవుతోంది. అప్ప‌ట్లో ఈమె గిల్లి అనే క‌న్న‌డ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ప‌రిచ‌యం అయింది. త‌రువాత కెర‌టం మూవీలో తెలుగులో న‌టించింది. కానీ ఈ మూవీ ఈమెకు అంత‌గా గుర్తింపును తెచ్చి పెట్ట‌లేదు. త‌రువాత వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలో ప్రార్థ‌న క్యారెక్ట‌ర్‌తో బాగా పాపుల‌ర్ అయింది. ఈ మూవీ హిట్‌ను సాధించ‌డంతో ఇక రకుల్ వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. ఈ క్ర‌మంలోనే ఈమె అగ్ర యంగ్ హీరోలు అంద‌రితోనూ న‌టించింది. అయితే ప్ర‌స్తుతం ఈమెకు తెలుగులో అవకాశాలు లేవు. దీంతో బాలీవుడ్‌లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటోంది.

ఇక ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌న సినిమా కెరీర్ ఆరంభంలో ఎంతో బొద్దుగా, ముద్దుగా ఉండేది. కానీ రాను రాను ఈ భామ స‌న్న‌బ‌డింది. హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలి ఏరియాలో ర‌కుల్‌కు ఓ సొంత జిమ్ ఉంది. దీనికి సెల‌బ్రిటీలు, ప్ర‌ముఖులు వ‌స్తుంటారు. అయితే జిమ్ పెట్టిన‌ప్ప‌టి నుంచి ఈమె స‌న్న‌గా మారింది. స్లిమ్‌గా త‌యారైంది. జీరో సైజ్‌ను సొంతం చేసుకుంది. అప్ప‌టి నుంచి అదే ఫిట్‌నెస్‌ను ఈమె మెయింటెయిన్ చేస్తోంది. ఎల్ల‌ప్పుడూ జిమ్‌లో గంట‌ల త‌ర‌బ‌డి సాధ‌న చేస్తుంటుంది. జిమ్, యోగా, వ్యాయామాలు, ఎరోబిక్స్ వంటివి చేస్తూ బాడీని ఫిట్‌గా, స్లిమ్‌గా మెయింటెయిన్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈమె జిమ్‌లో సాధ‌న చేసే ఫొటోలు, వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి కూడా.

Rakul Preet Singh told important things about food
Rakul Preet Singh

ఇక ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇటీవ‌ల ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించింది. తాను ఇంత స్లిమ్‌గా మార‌డానికి ప్ర‌త్యేకంగా డైట్ ఏమీ లేద‌ని.. త‌న‌కు ఇష్ట‌మైన ఆహారం తింటాన‌ని.. కాక‌పోతే ప‌ళ్ల ర‌సాల‌కు బ‌దులుగా పండ్ల‌నే నేరుగా తింటాన‌ని.. వీటితో మ‌న‌కు పోష‌కాలు అధికంగా ల‌భిస్తాయ‌ని.. ర‌కుల్ ప్రీత్ సింగ్ తెలియ‌జేసింది. అలాగే త‌న‌కు ఇష్ట‌మైన ఆహారాన్ని ఎంతైనా తింటాన‌ని.. త‌రువాత అంతే మోతాదులో వ్యాయామం కూడా చేస్తాన‌ని.. క‌నుక‌నే తాను స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండ‌గ‌లుగుతున్నాన‌ని.. లేక‌పోతే ఇంకా లావు అయ్యేదాన్న‌ని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. ఇలా ఆమె త‌న ఫిట్‌నెస్‌, స్లిమ్ సీక్రెట్ల‌ను వెల్ల‌డించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment