Bhool Bhulaiyaa 2 : బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రం.. ఓటీటీలో..!

June 18, 2022 12:01 PM

Bhool Bhulaiyaa 2 : బాలీవుడ్ స్టార్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో అప్ప‌ట్లో వ‌చ్చిన భూల్ భుల‌య్యా చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. 2007 అక్టోబ‌ర్‌12వ తేదీన రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీకి సీక్వెల్‌గా భూల్ భుల‌య్యా 2ను ఇటీవ‌లే తెర‌కెక్కించారు. ఈ మూవీ మే 20వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. హార్ర‌ర్ కామెడీ జోన‌ర్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యాన్ని సాధించింది. అయితే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

భూల్ భుల‌య్యా చిత్రం మే 20వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రాగా.. నెల రోజుల త‌రువాత ఇప్పుడు ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీన నెట్ ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఇందులో కార్తీక్ ఆర్య‌న్‌, కియారా అద్వానీలు లీడ్ రోల్స్‌లో న‌టించారు. ఈ మూవీ హిందీ మార్కెట్‌లో రూ.175 కోట్ల‌ను వ‌సూలు చేసి నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చి పెట్టింది.

Bhool Bhulaiyaa 2 releasing on Netflix on June 19th
Bhool Bhulaiyaa 2

ఇక బాలీవుడ్‌లో ఈ మ‌ధ్య కాలంలో అనేక సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ ఏ మూవీ కూడా స‌రైన విజ‌యాన్ని సాధించ‌లేక‌పోయింది. అయితే ఎలాంటి అంచ‌నాలు లేకుండానే భూల్ భుల‌య్యా 2 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఘ‌న విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment