Pushpa 2 : పుష్ప 2 లో ఆ పాత్ర‌ను చంపేయ‌బోతున్నారా ? అభిమానుల‌కు రుచిస్తుందా ?

June 18, 2022 11:27 AM

Pushpa 2 : అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పుష్ప మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాగా.. హిందీ మార్కెట్‌లోనూ ప్ర‌భంజ‌నాన్ని సృష్టించింది. దీంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇక త్వ‌ర‌లోనే పుష్ప 2 రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ద‌ర్శ‌కుడు సుకుమార్ ఇప్ప‌టికే క‌థ‌, స్క్రిప్ట్ ప‌నుల‌ను పూర్తి చేశార‌ని తెలుస్తోంది. దీంతో అతి త్వ‌ర‌లోనే పుష్ప 2 ను లాంచ్ చేయ‌నున్నారు.

ఇక పుష్ప లో ఉన్న దాదాపు అన్ని ప్ర‌ధాన పాత్ర‌లు పుష్ప 2లోనూ ఉంటాయ‌ని ఊహించ‌వ‌చ్చు. దాక్షాయ‌ణి, మంగ‌ళం శ్రీ‌ను, ఎస్‌పీ భ‌న్వ‌ర్‌సింగ్ షెకావ‌త్‌.. ఇలా విల‌న్లు అంద‌రూ క‌ల‌సి పుష్ప‌ను ఎదుర్కొంటార‌ని ఇప్ప‌టికే అనేక క‌థ‌లు ప్ర‌చారంలో ఉన్నాయి. అయితే క‌థ ఇంకా సిద్ధం కాలేదు క‌నుక ఇవ‌న్నీ ఊహాగానాలే అని చెప్ప‌వ‌చ్చు. అయితే పుష్ప 2 గురించి ఓ వార్త ప్ర‌స్తుతం సినీ వ‌ర్గాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదేమిటంటే.. పుష్ప మొద‌టి పార్ట్ నుంచి రెండో పార్ట్ కు కంటిన్యూ అయ్యే పాత్ర‌ల్లో ఒక పాత్ర‌ను సుకుమార్ చంపేయ‌బోతున్నార‌ట‌. అది ఎవ‌ర‌ని ఇప్పుడు జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది.

Pushpa 2 story important character information leaked
Pushpa 2

ఎలాగూ విల‌న్లు మూవీ ఆఖ‌ర్లో చ‌నిపోతార‌ని ఊహించ‌వ‌చ్చు. కానీ వీరు కాకుండా ఇంకో ప్ర‌ధాన పాత్ర‌ను సినిమా ఆరంభంలోనే చంపేయ‌నున్నార‌ట‌. అది శ్రీ‌వ‌ల్లి అని కొంద‌రు అంటుండ‌గా.. పుష్ప ఫ్రెండ్ అని ఇంకొంద‌రు అంటున్నారు. అయితే ఇప్ప‌టికైతే ఇవ‌న్నీ వైర‌ల్ అవుతున్న వార్త‌లే. ఇందులో నిజం ఎంత ఉంది.. అనే విష‌యం తెలియాల్సి ఉంది. అయితే ఒక‌వేళ నిజంగానే పుష్ప 2లో శ్రీ‌వ‌ల్లి పాత్ర‌ను చంపేస్తే.. అది అభిమానుల‌కు రుచిస్తుందా.. వారు ఈ ట్విస్ట్ తో సాటిసిఫై అవుతారా.. ఫ‌లితం ఎలా ఉంటుంది.. తేడా కొడుతుందా.. అన్న‌వివ‌రాలు తెలియాల్సి ఉంది. సినిమా విడుద‌లైతే కానీ దీనిపై క్లారిటీ రాదు. ఇక ఈ మూవీ షూటింగ్‌ను ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు పూర్తి చేసి సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తార‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment