Rashmi Gautam : ఏంటీ.. ర‌ష్మి గౌత‌మ్ పెళ్లి జ‌రిగిపోయిందా..?

June 16, 2022 5:18 PM

Rashmi Gautam : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ర‌ష్మి గౌత‌మ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె టీవీ షోల‌తోపాటు సినిమాల్లోనూ క‌నిపించి అల‌రిస్తోంది. అయితే ప్ర‌స్తుతం ఈమెకు పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌డం లేద‌నే చెప్పాలి. అయిన‌ప్ప‌టికీ సినిమాల‌క‌న్నా టీవీ షోల‌తోనే ఈమె ఎంతో బిజీ అయి పాపుల‌ర్‌గా మారింది. ఈ క్ర‌మంలోనే జ‌బ‌ర్ద‌స్త్ టీవీ షోలో ఎన్నో ఏళ్ల నుంచి యాంక‌ర్‌గా ప‌నిచేస్తూ వ‌స్తోంది. అయితే జ‌బ‌ర్ద‌స్త్ స్టేజిపై ర‌ష్మి గౌత‌మ్‌, సుడిగాలి సుధీర్‌ల మ‌ధ్య ఉండే ల‌వ్ ట్రాక్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

సుధీర్‌, ర‌ష్మిల మ‌ధ్య జ‌బ‌ర్ద‌స్త్ వేదిక‌గా ఒక ల‌వ్ ట్రాక్‌ను అయితే నిన్న మొన్న‌టి వ‌ర‌కు న‌డిపించారు. ఈ క్ర‌మంలోనే సుధీర్ ఇటీవ‌ల జ‌బ‌ర్ద‌స్త్‌కు గుడ్ బై చెప్పాడు. దీంతో ర‌ష్మి క‌న్నీళ్లు పెట్టుకుంది. అయితే వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్న‌ది కేవ‌లం షో కోసం న‌డిపిన ట్రాకే.. కానీ నిజ‌మైన ల‌వ్ ట్రాక్ కాదు. వీరిద్ద‌రూ ప్రేమించుకోలేదు. కానీ వీరి మ‌ధ్య ఏదో ఉంద‌ని అప్పుడ‌ప్పుడు వార్త‌లు వ‌స్తుంటాయి. అయితే తాజాగా ర‌ష్మి గౌతమ్ గురించి ఓ షాకింగ్ విష‌యం వైర‌ల్ అవుతోంది.

Rashmi Gautam marriage news viral on social media
Rashmi Gautam

ర‌ష్మి గౌత‌మ్‌కు ఇది వ‌ర‌కే పెళ్లి అయింద‌ని స‌మాచారం. కానీ ఆమె ఈ విష‌యాల‌ను గోప్యంగా ఉంచుతోంద‌ట‌. ఎవ‌రికీ తెలియ‌నివ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతోంద‌ట‌. అయితే పెళ్లి చేసుకుంటే ఇంత‌లా జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రం ఏమిటో.. ఎవరికీ ఈ విష‌యాన్ని చెప్ప‌కుండా ఉండ‌డం ఎందుకో.. అనే విష‌యాలు మాత్రం అర్థం కావ‌డం లేదు. కానీ ఈమె త్వ‌ర‌లోనే త‌న పెళ్లి గురించి ఒక ప్ర‌క‌ట‌న చేస్తుంద‌ని అంటున్నారు. త‌న‌కు ఇది వ‌ర‌కే పెళ్లి అయింద‌నే విష‌యాన్ని చెబుతుంద‌ని అంటున్నారు. కానీ కొంద‌రు మాత్రం ఆమెకు ఇంకా పెళ్లి కాలేద‌ని.. త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతుంద‌ని.. అదే విషయాన్ని ఆమె చెబుతుంద‌ని.. అంటున్నారు. మ‌రి ఇందులో నిజం ఎంత ఉంది అనే విష‌యం తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త‌ల‌న్నీ సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment