Radhika Apte : అవి పెద్ద‌గా లేవ‌ని సినిమా నుంచి తీసేశారు.. రాధికా ఆప్టే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

June 14, 2022 8:25 AM

Radhika Apte : బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ఎన్నో హిట్ చిత్రాల్లో న‌టించి న‌టిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ మ‌ధ్య కాలంలో ఈమె త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఇటీవ‌లే ఈమె హీరోయిన్ల స‌ర్జ‌రీల‌పై వ్యాఖ్య‌లు చేసింది. తాను స‌హ‌జ‌సిద్ధంగా అందంగా ఉండేందుకు ప్రాధాన్య‌త‌ను ఇస్తాన‌ని.. ఇత‌ర హీరోయిన్ల మాదిరిగా శ‌రీర భాగాల‌కు స‌ర్జ‌రీలు అవి చేయించుకోన‌ని స్ప‌ష్టం చేసింది. అయితే ఇప్పుడు మ‌ళ్లీ ఈమె సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. త‌న కెరీర్‌లో త‌న‌కు ఎదురైన ఓ చేదు అనుభ‌వాన్ని ఆమె వివ‌రించింది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

ప్ర‌స్తుత త‌రుణంలో అందాల ఆర‌బోత చేసే హీరోయిన్ల‌కే డిమాండ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక శ‌రీర భాగాలు కూడా క‌చ్చిత‌మైన కొల‌త‌ల‌తో ఉండాలి. పెద్ద‌గా ఉండాలి. అలాంటి హీరోయిన్ల‌కే ఎక్కువ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. అయితే రాధికా ఆప్టేను గ‌తంలో ఒక సినిమాలో తీసుకుని కూడా.. శ‌రీర భాగాలు పెద్ద‌గా లేవు, నువ్వు హీరోయిన్‌గా ప‌నికి రావు.. క‌నుక నువ్వు మా సినిమాలో చేయ‌లేవు.. అని ఆమెను ఆ సినిమా నుంచి తీసేశార‌ట‌. ఇదే విష‌యాన్ని రాధికా ఆప్టే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేసింది.

Radhika Apte sensational comments on her past film makers
Radhika Apte

కేవ‌లం శ‌రీర భాగాలు పెద్ద‌గా లేవ‌నే కార‌ణంతో త‌న‌ను ఓ సినిమా నుంచి త‌ప్పించార‌ని రాధికా ఆప్టే తెలిపింది. ఈ క్ర‌మంలోనే ఆమె వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. అయితే గ‌తంలో త‌న‌ను శ‌రీర భాగాల‌కు స‌ర్జ‌రీలు చేయించుకోవాల‌ని చాలా మంది సూచించార‌ని.. కానీ తాను త‌న‌కు స‌హ‌జ‌సిద్ధంగా ల‌భించిన అందానికే ప్రాధాన్య‌త‌ను ఇస్తాన‌ని.. స‌ర్జ‌రీలు చేయించుకోన‌ని చెప్పేశాన‌ని.. కాబ‌ట్టే సినిమా నుంచి తీసేశార‌ని తెలియ‌జేసింది. కాగా రాధికా ఆప్టే కామెంట్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment