Allu Arjun : అల్లు అర్జున్‌కు మ‌ళ్లీ చిక్కులు.. ఈసారి ఇంకో యాడ్ ద్వారా..!

June 10, 2022 5:13 PM

Allu Arjun : అల్లు అర్జున్ లేటెస్ట్ చిత్రం పుష్ప ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. హిందీ మార్కెట్‌లోనూ ఈ మూవీ భారీగానే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో పుష్ప 2 షూటింగ్ ప్రారంభం కానుంది. దీనికి గాను ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు సుకుమార్ క‌థ‌ను తీర్చిదిద్దేప‌నిలో ప‌డ్డారు. ఇక పుష్ప ద్వారా పాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌తో యాడ్స్ చేసేందుకు అనేక సంస్థ‌లు ఆస‌క్తిని చూపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప‌లు యాడ్స్ లో న‌టిస్తున్నారు. అయితే ఆయ‌న చేస్తున్న యాడ్స్ వివాదాల్లో చిక్కుకుంటున్నాయి.

గ‌తంలో అల్లు అర్జున్ ర్యాపిడో అనే బైక్ ట్యాక్సీ సంస్థ‌కు యాడ్ చేసిన విష‌యం విదిత‌మే. ఆర్‌టీసీ బ‌స్సుల క‌న్నా ర్యాపిడో బాగా వేగంగా వ‌స్తుంద‌ని ఆ యాడ్‌లో చూపించారు. దీంతో తెలంగాణ ఆర్‌టీసీ ఎండీ సజ్జ‌నార్ ఈ విష‌యంపై సీరియ‌స్ అయ్యారు. అల్లు అర్జున్‌తోపాటు స‌ద‌రు యాడ్‌ను తీసిన సంస్థ‌కు నోటీసులు పంపించారు. దీంతో వారు కాస్త వెన‌క్కి త‌గ్గి యాడ్‌కు మార్పులు చేశారు. ఆర్టీసీకి సారీ చెప్పారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ మళ్లీ ఇంకో యాడ్ వ‌ల్ల వివాదంలో ఇరుక్కున్నారు.

Allu Arjun once again in controversy complained against him
Allu Arjun

అల్లు అర్జున్ ఈ మ‌ధ్య శ్రీ చైత‌న్య విద్యాసంస్థ‌ల‌కు చెందిన యాడ్స్‌లో న‌టిస్తున్నాడు. విద్యార్థుల‌ను అందులో చేర్పించాల‌ని యాడ్స్ లో చూపిస్తున్నారు. అయితే జూన్ 6వ తేదీన శ్రీ‌చైత‌న్య సంస్థ‌కు చెందిన ఐఐటీ, ఎన్ఐటీ ర్యాంకుల యాడ్ వ‌చ్చింది. అయితే అందులో వివ‌రాల‌ను త‌ప్పుగా ఇచ్చార‌ని, స‌మాచారం మొత్తం త‌ప్పుదోవ ప‌ట్టించేదిలా ఉంద‌ని.. సామాజిక కార్య‌క‌ర్త ఉపేంద‌ర్ రెడ్డి మండిప‌డ్డారు. దీంతో ఆయన ఆ సంస్థ‌తోపాటు ఆ యాడ్‌లో న‌టించిన అల్లు అర్జున్‌పై ఫిర్యాదు చేశారు. వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఈ క్ర‌మంలోనే అల్లు అర్జున్ మ‌ళ్లీ వివాదంలో చిక్కుకుపోయార‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే దీనిపై స‌ద‌రు సంస్థ లేదా అల్లు అర్జున్ టీమ్ ఎలా స్పందిస్తారో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment