Prabhas : ఎట్ట‌కేల‌కు పెళ్లి చేసుకోనున్న ప్ర‌భాస్.. పెళ్లి ఎప్పుడంటే..?

June 10, 2022 3:39 PM

Prabhas : యంగ్ రెబ‌ల్ స్టార్‌గా పేరు తెచ్చుకుని త‌రువాత పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న బాహుబ‌లి సినిమాల ద్వారా పాన్ ఇండియా స్టార్ హోదాను పొందారు. అయితే బాహుబ‌లి త‌రువాత ప్ర‌భాస్‌కు హిట్స్ ప‌డ‌లేదు. సాహో, రాధేశ్యామ్ చిత్రాలు నిరాశ ప‌రిచాయి. దీంతో బాహుబ‌లి ముద్ర నుంచి బ‌య‌టకు వ‌చ్చేందుకు ప్ర‌భాస్ ఎంతో శ్ర‌మిస్తున్నారు. ఇక ప్ర‌భాస్‌కు ప్ర‌స్తుతం 40 ఏళ్ల‌కు పైగానే వ‌య‌స్సు ఉంది. దీంతో ఆయ‌న పెళ్లి ఎప్పుడు చేసుకుంటార‌ని.. ఆయ‌న ఫ్యాన్స్ అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌భాస్ త‌న రాధేశ్యామ్ మూవీ ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంలో ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. అప్పుడు పెళ్లిపై అడిగిన ప్ర‌శ్న‌ల‌కు తెలివిగా స‌మాధానాలు దాట‌వేశారు. ఈ క్ర‌మంలోనే అస‌లు ప్ర‌భాస్ పెళ్లి జ‌రుగుతుందా.. లేక ఆయ‌న కూడా స‌ల్మాన్ ఖాన్‌లా వృద్ధ బ్యాచిల‌ర్‌గా మిగిలిపోతారా.. అని ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు. అయితే ప్ర‌భాస్ పెద‌నాన్న కృష్ణం రాజు మాత్రం ఇటీవ‌లే ఓ మీడియా సంస్థ‌కు ప్ర‌భాస్ పెళ్లి గురించి చెప్పారు. ఈ ఏడాదే ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటాడ‌ని అన్నారు.

Prabhas finally marrying soon when is the date
Prabhas

ఇక ఏపీలోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా మొగ‌ల్తూరు గ్రామం కృష్ణం రాజు, ప్ర‌భాస్ ఫ్యాన్స్ అసోసియేష‌ణ్ అధ్య‌క్షుడు కూడా ఇదే విష‌యాన్ని వెల్ల‌డించారు. ప్ర‌భాస్ ఈ ఏడాదే పెళ్లి చేసుకుంటాడ‌ని చెప్పారు. దీంతో ఫ్యాన్స్‌కు ఒక క్లారిటీ అయితే వ‌చ్చేసింది. ఈ సారి వ‌చ్చే శ్రావ‌ణ మాసంలో ప్ర‌భాస్ పెళ్లి ఉంటుంద‌ని భావించ‌వ‌చ్చు. అయితే వ‌ధువు ఎవ‌రు అనే విష‌యాన్ని త్వ‌ర‌లోనే కృష్ణం రాజు దంప‌తులు మీడియాకు వెల్ల‌డించ‌నున్నార‌ట‌. ఈ విష‌యాన్ని చెప్పేందుకు త‌గిన సమ‌యం తీసుకోనున్నార‌ట‌. అందువ‌ల్లే ఈ విష‌యమై ఆల‌స్యం జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. ఇక ప్ర‌భాస్ పెళ్లి ఎప్పుడు జ‌రుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment