OTT : ఈ వారం ఓటీటీల్లో సంద‌డి చేయ‌నున్న సినిమాలు, సిరీస్‌ల వివ‌రాలు..!

June 6, 2022 6:56 PM

OTT : వారం వారం ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్‌ల కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. అందులో భాగంగానే ప్ర‌తి వారం ఓటీటీ యాప్‌లు కూడా త‌మ త‌మ ప్లాట్‌ఫామ్‌ల‌పై కొత్త కొత్త సినిమాల‌ను, సిరీస్‌ల‌ను విడుద‌ల చేస్తున్నాయి. క‌రోనా పుణ్య‌మా అని ఓటీటీల‌కు ఆద‌ర‌ణ పెరిగింది. దీంతో ఓటీటీల్లో వ‌చ్చే మూవీలు, సిరీస్‌లపై ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా దృష్టి పెడుతున్నారు. ఇక ఈ వారం విడుద‌ల కానున్న సినిమాలు, సిరీస్‌ల వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ల్యాణ్ దేవ్ న‌టించిన లేటెస్ట్ మూవీ కిన్నెర‌సాని. ఈ మూవీ ఎప్పుడో విడుద‌ల కావ‌ల్సి ఉంది. కానీ అనేక కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. అయితే ఈ మూవీని థియేట‌ర్ల‌లో కాకుండా ఓటీటీలోనే నేరుగా రిలీజ్ చేయ‌నున్నారు. జీ5 యాప్ లో ఈ నెల 10వ తేదీన ఈ మూవీ నేరుగా రిలీజ్ అవుతోంది.

list of movies and series releasing on OTT on June 10th 2022
OTT

ఇక మ‌ళ‌యాళ స్టార్ న‌టుడు మ‌మ్ముట్టి న‌టించిన సీబీఐ 5: ది బ్రెయిన్ మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌లై మంచి ఆద‌ర‌ణ పొందింది. ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్ లో ఈ నెల 12వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు.

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న పీకీ బ్లైండ‌ర్స్ సిరీస్‌కు ఎంత‌గానో ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. అందులో భాగంగానే ఈ సిరీస్‌కు చెందిన 6వ సీజ‌న్‌ను రిలీజ్ చేయ‌నున్నారు. నెట్ ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ ఈ నెల 10వ తేదీ నుంచి స్ట్రీమ్ కానుంది.

శివ కార్తికేయ‌న్ న‌టించిన డాన్ తమిళ మూవీ ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఈ మూవీని ఈ నెల 10వ తేదీన నెట్ ఫ్లిక్స్‌లోనే రిలీజ్ చేయ‌నున్నారు. కామెడీ డ్రామా జోన‌ర్‌లో ఈ మూవీని తెర‌కెక్కించారు. ఇక ఈ నెల 8న మిస్ మార్వెల్ అనే ఇంగ్లిష్ మూవీని డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ చేయ‌నున్నారు. ఈ మూవీ తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ళ‌యాళం భాష‌ల్లోనూ అందుబాటులోకి రానుంది.

ott

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment