Pawan Kalyan : ప‌వ‌న్ ఆ సినిమా చేస్తే.. హిట్ ప‌క్కా..!

June 6, 2022 10:51 AM

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ల్యాణ్ అనేక రోజుల పాటు రాజ‌కీయాల్లో ఉంటూ ఆ త‌రువాత చేసిన సినిమా భీమ్లా నాయ‌క్. ఈ మూవీ ఎప్పుడో విడుదల కావ‌ల్సి ఉన్నా.. అనేక కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. అయితే ఎట్ట‌కేల‌కు ఈ మూవీ విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. మ‌ళ‌యాళ రీమేక్ అయిన‌ప్ప‌టికీ తెలుగు నేటివిటీకి త‌గిన‌ట్లు ఈ మూవీని తెర‌కెక్కించారు. దీంతో సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. ఇక ప‌వ‌న్ ఓ వైపు రాజ‌కీయాల్లో బిజీగా ఉంటూనే.. మ‌రోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయన ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే మూవీలో న‌టిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఆగిపోయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తెర మీద‌కు వ‌చ్చింది. అదేమిటంటే..

మ‌ళ‌యాళంలో ఇటీవ‌లే రిలీజ్ అయిన జ‌న‌గ‌ణ‌మన అనే మూవీ జాతీయ స్థాయిలో చ‌ర్చ‌కు దారి తీస్తోంది. ఇందులో రాజ‌కీయ నాయ‌కులు త‌మ అవ‌స‌రాల కోసం యువ‌త‌ను ఎలా రెచ్చ‌గొడ‌తారు.. స‌మాజాన్ని ఎలా త‌ప్పుదోవ ప‌ట్టిస్తారు.. అనే విషయాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు. ఇందులో మ‌ళ‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ న‌టించ‌గా.. మ‌మ‌తా మోహ‌న్ దాస్ ఇంకో కీల‌క పాత్ర‌లో న‌టించింది. అయితే ఈ మూవీ ఓటీటీలోకి కూడా వ‌చ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో దాదాపు అన్ని భాష‌ల్లోనూ ఈ మూవీని స్ట్రీమ్ చేస్తున్నారు. అయితే ఇదే మూవీని ప‌వ‌న్ చేస్తే బాగుంటుంద‌ని అంటున్నారు.

if Pawan Kalyan does that movie it will be hit
Pawan Kalyan

జ‌న‌గ‌ణ‌మ‌న సినిమాలో పృథ్వీరాజ్ లాయ‌ర్‌గా న‌టించారు. క‌నుక ప‌వ‌న్ కూడా లాయ‌ర్‌గా చేస్తే బాగుంటుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం స‌మాజంలో రాజ‌కీయ ప‌రిస్థితులు అలాగే ఉన్నాయ‌ని.. అస‌లు స‌మ‌స్య‌ల గురించి ప్ర‌జ‌లు ఆలోచించ‌కుండా ఉండేందుకు నేత‌లు త‌ప్పుదారి ప‌ట్టించేలా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. క‌నుక ప‌వ‌న్ ఈ మూవీని చేస్తే అలాంటి వారికి చెంప పెట్టులా ఉంటుంద‌ని అంటున్నారు. అయితే ప‌వ‌న్ విశ్లేష‌కుల మాట‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారా.. లేదా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now