Rashmi Gautam : న్యాయం జ‌ర‌గాలంటూ.. రోడ్డెక్కిన ర‌ష్మి.. అస‌లు ఏం జ‌రిగింది..?

June 4, 2022 6:38 PM

Rashmi Gautam : బుల్లితెర‌పై జ‌బ‌ర్ద‌స్త్ షో ఎంత పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ షోకు అప్ప‌ట్లో రేటింగ్స్ భీభ‌త్సంగా వ‌చ్చేవి. ప్రేక్ష‌కులు ఈ షోకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఈ షో ద్వారానే చాలా మంది క‌మెడియ‌న్ల‌కు సినిమాల్లో బాగా అవ‌కాశాలు వ‌చ్చాయి. ఈ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. త‌రువాత దీనికి కొన‌సాగింపుగా ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ అనే షోను ప్రారంభించారు. అది కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. ఈ క్ర‌మంలోనే మొద‌ట్లో జ‌బ‌ర్ద‌స్త్‌కు అన‌సూయ యాంక‌ర్‌గా ఉండ‌గా.. త‌రువాత ర‌ష్మి వ‌చ్చింది. త‌రువాత జ‌బ‌ర్ద‌స్త్ రెండు షోల‌కు ఓ ద‌శ‌లో ర‌ష్మినే యాంక‌ర్‌గా చేసింది. అయితే అన‌సూయ రీ ఎంట్రీ ఇవ్వ‌డంతో ఆమెను మ‌ళ్లీ జ‌బ‌ర్ద‌స్త్‌కు యాంక‌ర్‌గా చేశారు. ఇక ర‌ష్మి య‌థావిధిగా ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌కు యాంక‌ర్‌గా కొన‌సాగుతోంది. అయితే ఇప్పుడు ఈ రెండు షోలు క‌ళ త‌ప్పాయ‌నే చెప్ప‌వ‌చ్చు.

అప్ప‌ట్లో ఈ షోల‌లో ఉన్న క‌మెడియ‌న్లు ఇప్పుడు లేరు. జ‌డ్జిలు కూడా మారిపోయారు. సుదీర్ఘ‌కాలం నుంచి కొన‌సాగిన సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీ‌నులు కూడా ఈ షోకు గుడ్ బై చెప్పేశారు. దీంతో ఆటో రామ్ ప్ర‌సాద్ ఒక్క‌డే ఎమోష‌న‌ల్‌గా స్కిట్లు చేస్తున్నాడు. అయితే తాజాగా చేసిన ఓ స్కిట్ మాత్రం అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. ఈ నెల 10వ తేదీన ప్ర‌సారం కానున్న ఎక్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ ప్రోమోను తాజా లాంచ్ చేశారు. ఇందులో ర‌ష్మి న్యాయం కావాల‌ని రోడ్డెక్క‌డం విశేషం.

Rashmi Gautam demands for justice latest Extra Jabardasth promo
Rashmi Gautam

ర‌ష్మి త‌న‌కు న్యాయం జ‌ర‌గాల‌ని ధ‌ర్నా చేస్తుండ‌గా.. ఫ్లైట్‌లో ఇమ్మాన్యుయెల్ అటు ఇటు కేఏ పాల్ లా తిరుగుతుంటాడు. ఇక ర‌ష్మి న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తుంటుంది. దీంతో ఇమ్మాన్యుయెల్ క‌ల్పించుకుని.. నేను ముందే చెప్పానా.. ఇలా జ‌రుగుతుంద‌ని.. ల‌వ్ సింబ‌ల్‌.. అంటూ వెళ్లిపోతాడు. దీంతో అంద‌రూ ఒక్క‌సారిగా న‌వ్వేస్తారు. ఇలా ఈ ప్రోమో సాగుతుంది. అయితే ర‌ష్మి సుధీర్‌పైనే స్కిట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే జ‌బ‌ర్ద‌స్త్ వేదిక‌పై వారిద్ద‌రి మ‌ధ్యే క‌దా ల‌వ్ ట్రాక్‌ను సృష్టించింది. క‌నుక సుధీర్ త‌న‌కు న్యాయం చేయాల‌ని ర‌ష్మి డిమాండ్ చేసింద‌ని స్కిట్ ప్రోమోను చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఇక ఇందులో ఏం జ‌రిగిందో తెలియాలంటే.. పూర్తి ఎపిసోడ్ ప్ర‌సారం అయ్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment