Sri Reddy : బావ కోసం నిప్పుల‌పై కోడిని ఎర్ర‌గా కాల్చానంటున్న శ్రీ‌రెడ్డి.. వీడియో..!

June 4, 2022 3:14 PM

Sri Reddy : సోష‌ల్ మీడియాలో ఈ మ‌ధ్య వంట‌ల వీడియోలు ఎలా పాపుల‌ర్ అవుతున్నాయో అంద‌రికీ తెలిసిందే. మ‌నంద‌రికీ తెలిసిన వంట‌కాలే అయిన‌ప్ప‌టికీ యూట్యూబ్‌లో వీడియోల్లో చూస్తే అవి కొత్త‌గా క‌నిపిస్తున్నాయి. దీంతో ఆయా వంట‌ల‌ను చూస్తే నోట్లో నీళ్లూరుతున్నాయి. ఫ‌లితంగా చాలా మంది వంట‌ల వీడియోల‌ను చూస్తున్నారు. ఇక యూట్యూబ‌ర్లు కూడా ఇలాంటి వీడియోల‌నే ఎక్కువ‌గా అప్‌లోడ్ చేస్తూ డ‌బ్బులు గ‌డిస్తున్నారు. అయితే సెల‌బ్రిటీలు కూడా తక్కువేమీ తిన‌లేదు. వారు కూడా అప్పుడ‌ప్పుడు వంట‌ల వీడియోల‌ను పోస్ట్ చేస్తున్నారు. ఇక ఈ జాబితాలో న‌టి శ్రీ‌రెడ్డి ఒక మెట్టు పైనే ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈమె ఎప్ప‌టిక‌ప్పుడు వంట‌ల వీడియోల‌ను పోస్ట్ చేస్తూ అల‌రిస్తోంది.

శ్రీ‌రెడ్డి ఈమ‌ధ్య కాలంలో యూట్యూబ్‌లోనే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. అందులో ఆమె ర‌క‌ర‌కాల వంట‌ల వీడియోల‌ను అప్‌లోడ్ చేస్తోంది. ఇప్ప‌టికే ఆమె చేప‌లు, పీత‌లు, మ‌ట‌న్‌, లేటెస్ట్‌గా ప‌న‌స పొట్టు కూర వండి ఆ వీడియోల‌ను అప్ లోడ్ చేసింది. దీంతో అవి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఇక తాజాగా ఆమె మ‌ళ్లీ ఇంకో వంట‌తో మ‌న ముందుకు వ‌చ్చింది. బొగ్గుల‌పై కోడిని గ్రిల్ చేసి అద్భుతంగా వండింది. చూస్తేనే నోరూరేలా ఉంది. ఇక దీనికి ఆమె బావ కోసం కోడికూర అనే కాప్ష‌న్ ను ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే ఆమె లేటెస్ట్ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది.

Sri Reddy cooked grill chicken village style viral video
Sri Reddy

అయితే శ్రీ‌రెడ్డి ఈమ‌ధ్య సామాజిక అంశాల‌పై స్పందించ‌డం లేదు. త‌న ప‌నేదో తాను చేసుకుపోతోంది. గ‌తంలో నాగ‌బాబు కుమార్తె నిహారిక డ్ర‌గ్స్ కేసులో అరెస్టు అయిన‌ప్పుడు మాత్రం శ్రీ‌రెడ్డి స్పందించింది. నాగ‌బాబుపై శ్రీ‌రెడ్డి ఒక రేంజ్‌లో ఫైర్ అయింది. అయితే స‌మాజంలో రోజూ ఎన్నో సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నా.. శ్రీ‌రెడ్డి మాత్రం వాటిని ప్ర‌స్తుతం ప‌ట్టించుకోవ‌డం లేదు. త‌న ప‌నేదో తాను చేసుకుంటూ బిజీగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment