Pooja Hegde : బ్లూ కలర్‌ డ్రెస్‌లో అందాలను ప్రదర్శిస్తూ.. చిత్తు చేస్తున్న బుట్ట బొమ్మ..!

June 4, 2022 12:21 PM

Pooja Hegde : ఒక లైలా కోసం అనే మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ.. పూజా హెగ్డె. ఈ అమ్మడు కెరీర్ ఆరంభంలో నటించిన చిత్రాలు అన్నీ ఫ్లాప్‌ అయ్యాయి. దీంతో ఈమెకు ఐరన్‌ లెగ్‌ అన్న ముద్ర పడిపోయింది. అయితే అనూహ్యంగా ఈమె పుంజుకుంది. గతేడాది కాలం నుంచి ఈమె నటిస్తున్న చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధిస్తున్నాయి. అయితే ఈ ఏడాదిలో మాత్రం ఈమెకు ఒక్క హిట్‌ కూడా లభించలేదు. రాధేశ్యామ్‌ మొదలు కొని బీస్ట్‌, ఆచార్య సినిమాలు వరుసగా ఫ్లాప్‌ అయ్యాయి. దీంతో పూజాకు మళ్లీ ఐరన్‌ లెగ్‌ అన్న ముద్ర పడింది. అయితే ఈ మధ్యే విడుదలైన ఎఫ్‌3 మూవీలో ఈమె ఐటమ్‌ సాంగ్‌ చేసి అలరించింది. పూజా కాసేపు మాత్రమే ఉన్నప్పటికీ ఈ మూవీకి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు.

ఇక సోషల్‌ మీడియాలోనూ ఈ భామ ఎల్లప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. గతంలో ఈమె మాల్దీవ్స్ కు వెళ్లినప్పుడు సోషల్‌ మీడియాలో వరుసగా ఫొటోలను షేర్‌ చేసి సెగలు రేపింది. అయితే ఇప్పుడు షూటింగ్‌లతో బిజీగా ఉన్నానని, వెకేషన్‌కు వెళ్లలేకపోతున్నానని చెబుతూ పూజా హెగ్డె అప్పటి ఫొటోలను మళ్లీ షేర్‌ చేసింది. బ్లూ కలర్‌ డ్రెస్‌లో ఎద అందాలను ప్రదర్శిస్తూ పూజా చేసిన గ్లామర్ షోకు కుర్రకారు మైమరిచిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె త్రో బాక్‌ పిక్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

Pooja Hegde says she is busy with film shootings
Pooja Hegde

ఇక సినిమాల విషయానికి వస్తే.. పూజా త్వరలోనే మహేష్‌తో కలిసి త్రివిక్రమ్‌ సినిమాలో చేయనుంది. గతంలో ఈమె మహేష్‌తో కలసి చేసిన మహర్షి మూవీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయింది. ఇక త్రివిక్రమ్‌ కూడా వరుస హిట్‌లతో జోరుమీదున్నారు. దీంతో ఈ ముగ్గురి కాంబినేషన్‌లో మరో హిట్‌ వస్తుందని అంటున్నారు. అలాగే సర్కస్‌, కభీ ఈద్‌ కభీ దివాలీ అనే హిందీ సినిమాల్లోనూ పూజా నటిస్తోంది. ఇవి ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్నాయి. త్వరలోనే విడుదల కానున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment