Hero : విపరీతంగా మద్యం సేవిస్తూ.. ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న బిగ్‌ హీరో..?

June 1, 2022 4:45 PM

Hero : మద్యం సేవించడం అనేది నేటి తరుణంలో కామన్ అయిపోయింది. వైన్‌ షాపులు ఎక్కువవడంతోపాటు చిన్న వయస్సు నుంచే అలవాటు అవుతుండడంతో చాలా మంది మద్యం సేవిస్తున్నారు. అయితే సెలబ్రిటీల విషయానికి వస్తే ఇది చాలా కామన్‌ విషయం. కాకపోతే వారు ఖరీదైన మద్యం సేవిస్తారు. అంతే తేడా.. అయితే ఓ బిగ్‌ హీరో మాత్రం దీనికి బానిస అవుతున్నాడని టాక్‌ వినిపిస్తోంది. ఆయన ఈ మధ్యే ఓ భారీ సినిమాలో చేయగా.. అది విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో ఇంకో మూవీలో నటించేందుకు ఆయన ప్లాన్‌ చేస్తున్నాడు.

అయితే సదరు బిగ్‌ హీరో ఈ మధ్య పీకలదాకా మద్యం సేవిస్తున్నాడట. ఈ మేరకు ఫిలిం నగర్‌ సర్కిల్‌లో సమాచారం చక్కర్లు కొడుతోంది. రాత్రి దాకా బాగా మద్యం సేవిస్తుండడం.. ఆ తరువాత ఎప్పటికో ఇంటికి వెళ్లడం చేస్తున్నాడట. మద్యం సేవించేటప్పుడు తన చుట్టూ ఫ్రెండ్స్‌ ఉండాలని పట్టుబడుతున్నాడట. అలా ఫ్రెండ్స్‌ ఉన్నప్పుడు తన ఫ్రస్ట్రేషన్‌ను అంతా బయట పెడుతున్నాడట. అయితే ఆ ఫ్రస్ట్రేషన్‌ అంతా ఎందుకనే విషయమే అర్థం కావడం లేదని ఫ్రెండ్స్ అంటున్నారు.

big Hero drinking habit worries his family
Hero

ఇక సదరు హీరో ఇలా చేస్తుండడంతో అతని కుటుంబం, అతని స్నేహితులు తెగ ఆందోళన చెందుతున్నారట. అతని ఆరోగ్యం నాశనం కావడంతోపాటు అతని శరీరాకృతి కూడా దెబ్బతింటుందని.. దీంతో సినిమాల్లో అందంగా కనిపించడేమో అని వారు తెగ హైరానా పడుతున్నారట. అయితే మద్యం సేవించడం అన్నది కామన్‌ విషయమే అయినా.. ఆ బిగ్‌ హీరో ఉన్నట్టుండి ఇలా మద్యానికి బానిస ఎందుకు అయ్యాడా.. అని ఫిలింనగర్‌లో చర్చించుకుంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now