Kamya Punjabi : పానీపూరీ మాయలో పడి రూ.1 లక్ష ఉన్న కవర్‌ను మరిచిపోయింది.. తరువాత ఏం జరిగిందంటే..?

June 1, 2022 3:19 PM

Kamya Punjabi : బయటకు వెళ్లినప్పుడు మనం సహజంగానే కొన్ని సందర్భాల్లో ఫోన్లు లేదా పర్సులను మరిచిపోతుంటాం. దీంతో ఒక్కోసారి తీవ్ర నష్టం కలుగుతుంది. మనకు గుర్తుకు వచ్చి మన వస్తువులను మనం తీసుకుంటే ఓకే. లేదంటే మన వస్తువులు మనకు ఇక దొరకవు. ఒకసారి వస్తువులను మరిచాక తిరిగి వెళ్లి వెదికినా అవి కనిపించవు. ఒక వేళ కనిపిస్తే అది లక్‌ అని చెప్పవచ్చు. అవును.. సరిగ్గా ఆ నటికి కూడా ఇలాగే జరిగింది. అదృష్టం ఆమె పక్షాన ఉంది కాబట్టే రూ.1 లక్షను పోగొట్టుకున్నట్లే అయింది. కానీ మళ్లీ ఆమె డబ్బులు ఆమెకు దక్కాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..

హిందీ నటి కామ్య పంజాబీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వెళ్లింది. అయితే అక్కడ ఉన్న ఓ ప్రముఖ పానీ పూరీ స్టాల్‌లో ఆమె పానీ పూరీలను టేస్ట్‌ చేసింది. దీంతో ఆమెతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. అయితే ఆ సందడిలో పడి ఆమె అక్కడ టేబుల్‌ మీద పెట్టిన రూ.1 నగదు ఉన్న ఓ కవర్‌ను మరిచిపోయింది. అక్కడి నుంచి వెళ్లిపోయింది.

Kamya Punjabi lost rs 1 lakh bag then know what happened
Kamya Punjabi

అయితే తన దగ్గర ఉంచుకున్న రూ.1 లక్ష కనిపించడం లేదని తరువాత తెలిసింది. దీంతో ఆ కవర్‌ను అక్కడే వదిలేసినట్లు నిర్దారించుకుని వెంటనే తన మేనేజర్‌ను అక్కడికి పంపించి కవర్‌ తీసుకురావాలని చెప్పింది. డబ్బు ఉంది కనుక కవర్‌ అక్కడ ఉండదేమోనని.. అసలు ఆ లక్ష రూపాయలు మళ్లీ తన దగ్గరకు రావేమోనని ఆమె ఆందోళన చెందింది. కానీ ఆమె మేనేజర్‌ అక్కడికి వెళ్లి చూసే సరికి ఆ డబ్బులు ఉన్న కవర్‌ అక్కడే ఉంది. దీంతో మళ్లీ తన డబ్బు తన దగ్గరకు చేరింది. ఈ క్రమంలోనే ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. సాధారణంగా ఇలాంటి సంఘటనల్లో మనం పోగొట్టుకున్న డబ్బు మనకు వెనక్కి రాదు. ఎప్పుడో ఒక సారి లక్‌ బాగుంటేనే ఇలా జరుగుతుంది. ఇప్పుడు కామ్య పంజాబీకి కూడా ఇలాగే జరిగింది. దీంతో ఆమెకు లక్‌ బాగా ఉందని.. లేకపోతే డబ్బులు పోయి ఉండేవని.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment