Bigg Boss Telugu 6 : బిగ్ బాస్ సీజ‌న్ 6 కంటెస్టెంట్లు వీరేనా..?

May 27, 2022 4:26 PM

Bigg Boss Telugu 6 : బుల్లితెర‌పై అత్యంత ఫేమ‌స్ అయిన షోల‌లో ఒక‌టి.. బిగ్‌బాస్. అయితే ఇటీవ‌లే బిగ్‌బాస్ ఓటీటీ షో ముగిసింది. కానీ దీనికి పెద్ద‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. అయితే త్వ‌ర‌లోనే బిగ్ బాస్ సీజ‌న్ 6 ప్రారంభం కానుంది. దీనికి కూడా నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. అందులో భాగంగానే లేటెస్ట్‌గా సీజ‌న్ 6 ప్రోమోను కూడా విడుద‌ల చేశారు. ఇక ఈ షో మ‌రో నెల రోజుల్లో ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది. అయితే ఈసారి సామాన్యుల‌కు ఈ షోలో పాల్గొనే అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు నాగార్జున చెప్పారు. దీంతో మ‌రోసారి ఔత్సాహికులు అంద‌రూ ఈ షోలో పాల్గొనేందుకు త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకుంటున్నారు.

అయితే బిగ్ బాస్ సీజ‌న్ 6లో ఎంత మంది కంటెస్టెంట్లు ఉంటారు ? అనే విష‌యంపై ప్ర‌స్తుతం నిర్వాహ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నారు. అయితే బిగ్‌బాస్ ఓటీటీలో టాప్ 5 స్థానాల్లో వ‌చ్చిన వారిని సీజ‌న్ 6 తీసుకుంటామ‌ని గ‌తంలో చెప్పారు. అలా జ‌రిగే ఇంకో 8 మంది కంటెస్టెంట్లను తీసుకుంటే స‌రిపోతుంది. వారిలో ఒక కంటెస్టెంట్ సామాన్య ప‌బ్లిక్ ఉంటారు. క‌నుక ఇంకో 7 మంది సెల‌బ్రిటీల‌ను తీసుకుంటే చాలు. దీంతో ఈ 7 మందిలో ఏయే సెల‌బ్రిటీలు ఉంటారు.. అనే విష‌యంపై ఇప్పుడు చ‌ర్చ‌లు న‌డుస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ సీజ‌న్‌లో పాల్గొన‌బోయే కొంద‌రు కంటెస్టెంట్ల పేర్లు మాత్రం బాగానే వినిపిస్తున్నాయి. ఇక వారి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

Bigg Boss Telugu 6 contestants list leaked
Bigg Boss Telugu 6

అప్ప‌ట్లో స్టార్ యాంక‌ర్‌గా ఒక వెలుగు వెలిగిన ఉద‌య‌భాను బిగ్‌బాస్ సీజ‌న్ 6లో పాల్గొంటున్నార‌ని తెలిసింది. అలాగే జబ‌ర్ద‌స్త్ షో ద్వారా పాపుల‌ర్ అయిన గెట‌ప్ శ్రీ‌ను, సీరియ‌ల్ న‌టుడు అనుదీప్ చౌద‌రి, ఆర్‌జే హేమంత్‌, యాంక‌ర్లు రోజా, ప్ర‌త్యూష‌, సింగ‌ర్ మామ సింగ్ అలియాస్ కృష్ణ చైత‌న్య‌, న‌టుడు కౌశిక్‌, యూట్యూబ‌ర్ నిఖిల్‌.. త‌దిత‌రులు ఈసీజ‌న్‌లో పాల్గొంటార‌ని తెలుస్తోంది. అయితే దీనిపై త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment