Viral Video : హ్యాట్సాఫ్‌.. ఒంటి కాలుతోనే రోజుకు 1 కిలోమీటర్‌ దూరం స్కూల్‌కు నడిచివెళ్తున్న బాలిక.. వీడియో వైరల్‌..!

May 27, 2022 7:18 AM

Viral Video : కృషి, పట్టుదల ఉండాలే కానీ.. మన శారీరక వైకల్యం దేనికీ అడ్డుకాదు. మనసులో సంకల్పం ఉండాలి. ఏదో సాధించాలన్న తపన ఉండాలి. అలాంటి వ్యక్తిత్వం ఉంటే జీవితంలో ఎవరైనా సరే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. తమ మార్గంలో ఎన్ని ముళ్ల కంచెలు ఉన్నా సరే లెక్క చేయరు. ముందుకే సాగుతుంటారు. అవును.. ఈ సూత్రాలను బాగానే వంట బట్టించుకుంది. కాబట్టే ఆ బాలిక తనకు శారీరక వైకల్యం ఉన్నప్పటికీ ఏమాత్రం దాన్ని లెక్క చేయకుండా ముందుకే సాగుతోంది. కష్టపడి విద్యాభ్యాసం కొనసాగిస్తోంది. దీంతో అందరి నుంచి ఆమె ప్రశంసలను అందుకుంటోంది. ఇక అసలు విషయం ఏమిటి ? అని వివరాల్లోకి వెళితే..

బీహార్‌లోని ఫతేపూర్‌కు చెందిన సీమా అనే బాలిక వయస్సు 10 ఏళ్లు. ఈమెకు కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎడమ కాలు పూర్తిగా పోయింది. అయినప్పటికీ ఈమె ఏమాత్రం భయపడలేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. ఒంటికాలిపైనే స్కూల్‌కు రోజూ నడిచివెళ్తూ విద్యాభ్యాసం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె రోజుకు కిలోమీటర్‌ దూరం పాటు ఒంటికాలిపైనే నడిచి వెళ్తోంది. అయితే ఈమెను వీడియో తీసి ఈమె సమస్య గురించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈమెకు సహాయం చేసేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు.

Viral Video girl going to school with only one leg by walk
Viral Video

సీమాకు ఇప్పటికే ఆ జిల్లా కలెక్టర్‌ ఓ ట్రైసైకిల్ ను అందజేశారు. దీంతో ఆమె ఆ ట్రై సైకిల్‌పై స్కూల్‌కు వెళ్తోంది. ఇక సీమా గురించి నటుడు సోనూసూద్‌కు కూడా విషయం తెలిసింది. దీంతో ఆయన కూడా సీమాకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇలా సోషల్‌ మీడియా ద్వారా సీమా గురించి చాలా మంది తెలుసుకుని ఆమెకు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఏదో ఒక రోజు తాను అనుకున్న లక్ష్యాన్ని కచ్చితంగా సాధిస్తుందని అందరూ అంటున్నారు. కాగా సీమా స్కూల్‌కు వెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది.

https://youtu.be/CMKKAv7LjiM

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment